English   

వెంకీ మామ టాక్... ఎమోషనల్ అయిన వెంకీ

 venkatesh
2019-12-13 18:40:17

ఈరోజు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా విడుడలైన వెంకీమామ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధానికి జాతకాల సబ్జెక్ట్ యాడ్ చేయడంతో వారి ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కథ రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడని  సినిమా చూసి వచ్చిన వారు చెబుతున్నారు. ఇక మొదటి సారి తన మేనల్లుడి తో కలిసి నటించిన సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళతున్న నేపథ్యంలో బర్త్ డే బాయ్ హీరో వెంకటేశ్‌ స్పందించారు. ఒక వైపు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సన్నిహితుల శుభాకాంక్షల వెల్లువ, మరోవైపు తన చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో వెంకటేష్‌కు డబుల్‌ కా మీటా తున్నట్టు ఉండి ఉంటుంది. ఈ సంతోష సమయంలో తన తండ్రి మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడిని తలుచుకుంటూ వెంకటేష్ ఎమోషనల్ అయ్యారు.  ఈ సంతోషంలో నువ్వు వుంటే బావుండేది నాన్నా అంటూ తండ్రిని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి రోజున మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం నాన్నా! మిస్‌ యూ నాన్న’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు వెంకీమామ ఇప్పుడు మీ అందరిదీ. దగ్గరలోని థియేటర్‌కు వెళ్లి చూడండి. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి అని వెంకటేశ్‌ ఆ పోస్ట్ లోపీకొన్నరు. అలాగే చైతూతో చిన్నప్పుడు దిగిన ఫోటోను, వెంకీమామ చిత్రంలోని స్టిల్‌ని పోస్ట్ చేశారు.


 

More Related Stories