English   

వెంకీ విత్ ఫ్రస్టేషన్ టీమ్

Venkatesh

విక్టరీ వెంకటేస్ చాలాకాలం తర్వాత మేకప్ వేసుకున్నాడు. గురు సినిమా తర్వాత ఆయన మరే కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. ఈ మధ్యతో తేజతో చేస్తున్నాడని.. మరో దర్శకుడితో చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. కానీ కంప్లీట్ ఎంటర్టైనర్స్ తో ఓ హ్యాట్రిక్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇది మల్టీస్టారర్. వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ కూడా వెరైటీగా ఉంది. ‘ఎఫ్ 2’ ఇది టైటిల్. అంటే ఫన్ అండ్ ఫ్రస్టేషన్. మరి ఫ్రస్టేషన్ నుంచి ఫన్ పుట్టిస్తాడా.. లేక ఫన్ తో ఫ్రస్టేట్ చేస్తాడా అనేది తెలియదు కానీ.. అనిల్ సినిమాల్లో ఫన్ కుమాత్రం ఏ ఢోకా ఉండదు. ఇక రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఈమూవీ షూటింగ్ లోకి లేటెస్ట్ గా వెంకీ జాయిన్ అయ్యాడు. 

చాలా రోజుల తర్వాత వెంకీ లుంగీలో కనిపిస్తున్నాడీ సినిమాలో. వెంకీ షూటింగ్ లో జాయిన్ అయిన విషయాన్ని దర్శకుడు లొకేషన్ లో ఆయనతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఏమాటకామాటే.. వెంకీలో మునుపటి చార్మింగ్ కనిపించడం లేదు. ఏదో చాలా రోజులుగా హాస్పిటల్ లో ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడనే కంప్లైంట్స్ ఈ మధ్య చాలా వినిపించాయి. కానీ ఈ లుక్ లో అలా ఏం కనిపించడం లేదు.. క్లీన్ షేవ్ తో దేనికైనా రెడీ అన్నట్టుగా చాలా హుషారుగా ఉన్నాడు. ఇక ఈ మూవీని ఈ యేడాదే నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

More Related Stories