English   

వెంక‌టేశ్ తో ఆడుకుంటున్నారా తేజ‌గారు..?

Venkatesh and Teja
2018-02-21 14:00:44

తేజ‌.. ఈ పేరుకు ఇండ‌స్ట్రీలో ఓ గుర్తింపు ఉంది. అలాగే ఈ పేరంటే ఓ ఇమేజ్ కూడా ఉంది. హీరోలెవ‌రైనా తాను చెప్పింది చేయ‌క‌పోతే అరుస్తాడు.. ఒక్కోసారి కొత్త వాళ్ల‌నైతే కొడ‌తాడు అనే పేరు కూడా ఉంది. ఇన్నాళ్ల సంగ‌తి ఎలా ఉన్నా ఇప్పుడు మ‌నోడు స్టార్స్ తో ప‌ని చేస్తున్నాడు కాబ‌ట్టి అంత దూరం వెళ్ల‌డు. అయినా మ‌న ఇండ‌స్ట్రీలో ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా ప‌ర్లేదు కానీ ఒక్క హిట్ వ‌స్తే చాలు అన్నీ మ‌రిచిపోతారు. 15 ఏళ్లు విజ‌యం లేని తేజ‌.. ఊహించ‌ని విధంగా నేనే రాజు నేనేమంత్రితో హిట్ కొట్టాడు. మ‌ళ్లీ ఈయ‌న్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు హీరోలు. ఇప్పుడు ఈయ‌న వెంక‌టేశ్ హీరోగా త్వ‌ర‌లోనే సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుండి హైదరాబాద్ ఓల్డ్ సిటిలోప్రారంభం కానుంది. అనూప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో దాదాపు 60 మంది కొత్తవాళ్లే నటిస్తున్నారు. గురు సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కు తేజ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఓకే అన్నాడు. ఆటా నాదే వేటా నాదే టైటిల్ అనుకుంటున్నా.. అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ త్వ‌ర‌లోనే రానుంది. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories