English   

వెంకీతో తేజ‌.. ఇక లేన‌ట్లే..!

venatesh-teja

మ‌రోసారి కూడా ఇదే జ‌రిగింది. అప్పుడెప్పుడో మూడేళ్ల కింద సావిత్రి అంటూ వెంక‌టేశ్ తో సినిమా అనౌన్స్ చేసాడు తేజ‌. అప్పుడంటే ఆయ‌న ఫ్లాపుల్లో ఉన్నాడు కాబ‌ట్టి ఆపేసిన అర్థం ఉంది. కానీ ఇప్పుడు నేనేరాజు నేనేమంత్రితో హిట్ కొట్టాడు. పైగా ఆట‌నాదే వేట‌నాదే అంటూ ఓ సినిమాను కూడా అనౌన్స్ చేసాడు. కానీ ఇప్పుడు మ‌రోసారి ఈ చిత్రం ఆగిపోయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. చూస్తుంటే తేజ‌తో వెంక‌టేశ్ కాంబినేష‌న్ ఎప్ప‌టికీ సెట్ అయ్యేలా క‌నిపించ‌ట్లేదు. నిర్మాత సురేష్ బాబుతో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగానే ఈ సినిమా ఆగిపోయిన‌ట్లు తెలుస్తుంది. వెంకీ సినిమాతో పాటే బాల‌య్యతో ఎన్టీఆర్ బ‌యోపిక్ కు కూడా క‌మిట‌య్యాడు తేజ‌. ఈ రెండు సినిమాలు ఒకేసారి తెర‌కెక్కించ‌డం అంటే మాట‌లు కాదు. ఎందుకంటే అక్క‌డ ఉన్నది పెద్దాయ‌న బ‌యోపిక్. 

ఎలాంటి ప్రీ ప్రొడ‌క్ష‌న్ లేకుండా నేరుగా వెళ్లి ఎన్టీఆర్ బ‌యోపిక్ చేయ‌డం అంటే ఈజీ కాదు. ఏ చిన్న తేడా జ‌రిగినా అభిమానుల నుంచే కాదు.. తేజ కెరీర్ పై కూడా మ‌చ్చ ప‌డుతుంది. దాంతో వెంక‌టేశ్ సినిమాను త‌ప్ప‌క ప‌క్క‌న బెట్టేసాడ‌ని తెలుస్తుంది. అది కాకుండా నిర్మాత సురేష్ బాబుతో తేజ‌కు పెద్ద‌గా ప‌డ‌టం లేద‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ కార‌ణంతోనే ఇప్ప‌టికే ఎప్పుడో ప‌ట్టాలెక్కాల్సిన సినిమా కాస్తా ఇప్ప‌టికీ సెట్స్ పైకి రాలేదు. ఇక రావాల్సిన అవ‌స‌రం కూడా లేదు. తేజ సినిమా కాకుండా మ‌రో రెండు సినిమాల‌కు క‌మిట‌య్యాడు వెంక‌టేశ్. ఆ రెండు కూడా మ‌ల్టీస్టారర్స్ కావ‌డం విశేషం. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా.. అనిల్ రావిపూడితో ఎఫ్ 2 సినిమాలో న‌టిస్తున్నాడు వెంక‌టేశ్. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. మొత్తానికి తేజ ఆట వేట వెంక‌టేశ్ తో కుద‌ర్లేద‌న్న‌మాట‌. 

More Related Stories