English   

హ‌మ్మ‌య్య‌.. వెంకీ సినిమా మొద‌లైంద‌య్యా..!

Venkatesh-Teja

ఎప్ప‌ట్నుంచో వినిపిస్తున్న సినిమా ఇప్ప‌టికి మొద‌లైంది. అస‌లు మొద‌ల‌వుతుందా లేదా అనే అనుమానాలు కూడా మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌స్తున్న వేళ‌.. లేదు మొద‌ల‌వుతుంది అంటూ సినిమాకు ప‌చ్చ‌జెండా ఊపాడు వెంక‌టేశ్. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టిస్తోన్న సినిమా స్టిల్స్ విడుద‌ల‌య్యాయి. గ‌తంలో ఈ కాంబినేష‌న్ లో సావిత్రి అనే సినిమా రావాల్సి ఉన్నా.. అనుకోని కార‌ణాల‌తో అట‌కెక్కింది. ఈ సారి కాంబినేషన్ కుదిరి కూడా ఆర్నెళ్ల‌కు పైనే అయినా ఇప్ప‌టికీ సినిమా ప‌ట్టాలెక్క‌క‌పోతే ఈ సారి అలాంటి వార్తే వినాల్సి వ‌స్తుందేమో అనుకున్నారు అభిమానులు. కానీ వాళ్ల ఆశ‌ల‌ని నిలబెడుతూ వెంక‌టేశ్ సినిమా ముందుకు క‌దిలింది. తాజాగా ఈ చిత్ర స్టిల్స్ విడుద‌ల‌య్యాయి. ఇవి చూసిన త‌ర్వాత సినిమా రెడీ అవుతుంద‌నే న‌మ్మ‌కం ప్రేక్ష‌కుల్లో వ‌చ్చింది. ఇందులో వెంక‌టేశ్ లెక్చ‌ర‌ర్ గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు విడుద‌లైన స్టిల్స్ లో కూడా గురువుగానే క‌నిపిస్తున్నాడు ఈయ‌న‌. సుంద‌రాకాండ త‌ర్వాత మ‌రోసారి టీచ‌ర్ గా న‌టిస్తున్నాడు వెంక‌టేశ్. 

15 ఏళ్లు విజ‌యం లేని తేజ‌.. ఊహించ‌ని విధంగా నేనే రాజు నేనేమంత్రితో హిట్ కొట్టాడు. మ‌ళ్లీ ఈయ‌న్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు హీరోలు. ఇప్పుడు ఈయ‌న వెంక‌టేశ్ హీరోగా త్వ‌ర‌లోనే సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుండి హైదరాబాద్ ఓల్డ్ సిటిలోప్రారంభం కానుంది. అనూప్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో దాదాపు 60 మంది కొత్తవాళ్లే నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కేవ‌లం రెండు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు తేజ‌. గురు సినిమా త‌ర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కు తేజ చెప్పిన పాయింట్ నచ్చడంతో ఓకే అన్నాడు. ఆటా నాదే వేటా నాదే టైటిల్ అనుకుంటున్నా.. అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ త్వ‌ర‌లోనే రానుంది. సురేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories