English   

 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మొదలైంది

Varun-Tej

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రాబోతోన్న మూవీ ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’మొదలైంది. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాత. ఇప్పటికే వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడి ఈ సారి కూడా ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా హిట్లే కాదు.. సినిమాలూ లేక ఖాళీగా ఉన్న వెంకటేష్ కు ఇది కాస్త జోష్ ఇచ్చే సినిమా అవుతుందనుకోవచ్చు. అటు ఫిదా నుంచి రూట్ మార్చి తొలిప్రేమతో సూపర్ హిట్ కొట్టి.. ఇప్పుడు స్పేస్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తోన్న వరుణ్ కూ ఇది ఛేంజ్ ఓవర్ లాంటి సినిమా అవ్వొచ్చు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది.. 

ఇక హీరోయిన్లనూ ఇప్పటికే ఎంపిక చేసుకుని ఉన్నారు. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్, వెంకీ సరసన తమన్నా రొమాన్స్ చేయబోతున్నారు. ఈ హీరోలతో ఆ హీరోయిన్లు చేయడం కూడా ఇదే మొదటిసారి. మొత్తంగా ఇదో ఫ్రెష్ టీమ్ అనుకోవచ్చు. ఈ కూల్ టీమ్ తో సూపర్ ఫన్ క్రియేట్ చేయబోతున్నట్టు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా నమ్మకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టుగా వల్గారిటీ లేని కామెడీతో ఆకట్టుకుంటోన్న అనిల్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అనేలా ఉందీ కాంబినేషన్ చూస్తోంటే. మొత్తంగా షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ రెగ్యులర్ గా షూట్ తో ఈ యేడాదే విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.. 

More Related Stories