English   

ఫ్రస్టేషన్ మొదలైందా..?

Venkatesh-Varun-Tej

పటాస్ తో మొదలుపెట్టి టాప్ గేర్ లో దూసుకుపోతోన్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. రొటీన్ కథలకే అదిరిపోయే హ్యూమర్ యాడ్ చేసి మంచి హిట్లు కొడుతోన్న అనిల్ లేటెస్ట్ గా ఫ్రస్టేషన్ మొదలుపెట్టేశాడు. అఫ్ కోర్స్ దీనికీ తనదైన ఫన్ యాడ్ చేశాడనుకోండి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం. టైటిల్ గతంలో అనౌన్స్ చేసిందే.. ఫన్ అండ్ ఫ్రస్టేషన్. మరి ఈ ఇద్దరు హీరోల్లో ఫన్ క్రియేట్ చేసేది ఎవరో.. ఎవరిని ఎవరు ఫ్రస్టేట్ చేస్తారో కానీ.. టైటిల్ డిఫరెంట్ గా ఉంది. జూన్ లో మొదలుకాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. కాకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్.. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటిస్తున్నాడు. అది ఓ కొలిక్కి రాగానే ఈ మల్టీస్టారర్ మొదలవుతుంది. ఈ లోగా వెంకీ కూడా మరో కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకునే అవకాశాలున్నాయి.  ఇప్పటికైతే హీరోలు మాత్రమే ఫైనల్ అయ్యారు. ఇంకా హీరోయిన్లతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ సెలెక్షన్ జరుగుతోంది. అంటే జూన్ వరకూ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి. అలాగే సమ్మర్ హీట్ కూడా ముగుస్తుంది కాబట్టి.. ఆ తర్వాత మాన్ సూన్ లో ఫ్రెష్ గా షూటింగ్ మొదలుపెడతారన్నమాట. ప్రస్తుతం వినిపిస్తోన్నదాన్ని బట్టి.. ఈ యేడాది చివర్లోనే సినిమా విడుదలయ్యే అవాకాశాలున్నాయిట. మొత్తంగా ఈ రేర్ కాంబినేషన్ ను సెట్ చేసిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ వీరితో ఎంత ఫన్ క్రియట్ చేస్తుందో చూడాలి. 

More Related Stories