English   

అయ్యో రామా వెంకటేష్ రిటైర్ అవుతాడంట.. 

Venkatesh
2019-12-13 12:28:55

తెలుగు ఇండస్ట్రీలో ఉన్నదున్నట్లు చాలా ఓపెన్ గా మాట్లాడే హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేష్ మాత్రమే. తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పేస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. డిసెంబర్ 13 ఈయన పుట్టినరోజు. ఈ రోజే వెంకీ మామ కూడా థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం చెప్పాడు వెంకీ. 

తాను రిటైర్ అయిపోతానని అనుకుంటున్న ప్రతిసారి ఎవరో ఒకరు నన్ను సినిమాల్లోకి లాగుతున్నారని అన్నాడు ఈ సీనియర్ హీరో. తాను హీరో అయి అప్పుడే 33 ఏళ్లయింది.. ఇంకా ఎన్నాళ్లు సినిమా చేయాలి.. ఇక ఫీల్డ్ నుంచి జంప్ అవ్వడమే.. నేను ఎప్పట్నుంచో జంప్ అవ్వాలని అనుకుంటున్నాను.. కానీ వదలట్లేదు. ఐదేళ్ల నుంచి రిటైర్ అయిపోతానని చెబుతున్నాను కానీ కుదరట్లేదు.. నా కోసం ఇంకా డిజైన్ చేస్తూనే ఉన్నారు.. ఆ ఎనర్జీ ఇంకా వస్తోంది, అదే నాక్కూడా ఆశ్చర్యంగా ఉంది.. వద్దన్నా ఆఫర్లు కూడా వస్తున్నాయి. అది కూడా ఆశ్చర్యమే అంటూ చెప్పుకొచ్చాడు వెంకటేష్. ఇకపై కూడా మల్టీస్టారర్స్ చేస్తానంటున్నాడు ఈయన. 

ఇప్పటికే ఈ హీరో వరుణ్ తేజ్, నాగ చైతన్య, రామ్, మహేష్ బాబు లాంటి హీరోలతో కలిసి నటించాడు. తనకు మరోసారి ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. గతంలో ఈ ఇద్దరూ కలిసి చింతకాయల రవి సినిమాలో ఓ పాటలో నటించారు. సీనియర్ల సంగతి పక్కనపెడితే కుర్ర హీరోలు మాత్రం చాలా సినిమాలు చేయాలి.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఉందని మనసులో మాట బయట పెట్టాడు వెంకీ. నానితో కూడా గతంలో ఓ సినిమా అనుకున్నాం కానీ కుదర్లేదని.. అతడితో కూడా వర్క్ చేయాలని ఉందని చెప్తున్నాడు వెంకీ. తన కొడుకు అర్జున్ అనిపించింది చేస్తాడని.. వాడిని సినిమాల వైపు రుద్దనని.. వస్తే కాదనని చెబుతున్నాడు ఈయన. 

More Related Stories