English   

ఒక్క ఫ్లాప్ తో జ్ఞాన‌బ‌ల్బ్ వెలిగిందిగా.. 

Venky-Atluri-akhil

అఖిల్ తొలి సినిమా విడుద‌ల కాక‌ముందు ఆయ‌న నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసారు. అక్కినేని కుటుంబంలో తొలి మాస్ హీరో అవుతాడ‌ని క‌ల‌లు క‌న్నారు అభిమానులు. ఇక ఈయ‌న కంటే గొప్ప డాన్స‌ర్ అక్కినేని కుటుంబంలో లేడు.. రాడు అనుకున్నారు. ఈ ఒక్క విష‌యంలో మాత్ర‌మే త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు అఖిల్. కానీ న‌టుడిగా.. హీరోగా.. విజ‌యం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు అందుకోలేదు. ఒక్క హిట్ అంటూ ఇప్ప‌టికీ వేచి చూస్తూనే ఉన్నాడు. కెరీర్ లో క్లారిటీ కంటే క‌న్ఫ్యూజ‌న్ ఎక్కువ‌గా పెట్టుకుని తిరుగుతున్నాడు సిసింద్రీ. దాంతో హిట్ అనే మాటే ఈ కుర్రాడి ద‌రికి రావ‌డం లేదు. అఖిల్ ఫ్లాప్ తో అఖిల్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ సినిమాను పూర్తిగా మరిచిపోవ‌డానికే ఈ కుర్ర హీరోకు రెండేళ్లు ప‌ట్టింది. ఇక మొన్న చేసిన హ‌లో కూడా ఫ్లాపే. కాక‌పోతే ఈ చిత్రం కాస్త న‌యం. ప్రేమ‌క‌థ‌కు తాను సూట్ అవుతాన‌ని ప్రేక్ష‌కుల్లో న‌మ్మ‌కం క‌లిగించాడు అఖిల్. దాంతో అఖిల్ ఏం చేయ‌కూడ‌దో నేర్పించింది.. హ‌లో ఏం చేయాలో తెలిసేలా చేసింది. ఇప్పుడు హ‌లో చెప్పిందే చేస్తున్నాడు ఈ హీరో. ఈయ‌న‌ మూడో సినిమాపై చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టి చెప్పిన క‌థ ఒక‌టి బాగా న‌చ్చినా కూడా ఈ టైమ్ లో రిస్క్ తీసుకోవ‌డం ఇష్టం లేక వ‌దిలేసాడు అఖిల్. ఇక అదే టైమ్ లో కొర‌టాల‌.. సుకుమార్ లాంటి ద‌ర్శ‌కుల పేర్లు వినిపించినా.. వాళ్లు చాలా బిజీగా ఉన్నారు. దాంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో మూడో సినిమా ఫిక్స‌య్యాడు అఖిల్. స్టార్ డైరెక్ట‌ర్ల జోలికి వెళ్తే వాళ్లేం చేస్తారో.. ఏం తీస్తారో అఖిల్ కు కూడా క్లారిటీ రావ‌డం లేదు. వినాయ‌క్ తో పాటు విక్ర‌మ్ కే కుమార్ కూడా అఖిల్ ఆశ‌ల‌ను నిల‌బెట్ట‌లేక‌పోయాడు. దాంతో ఇప్పుడు కుర్ర ద‌ర్శ‌కున్ని న‌మ్ముకుని వ‌స్తున్నాడు అఖిల్. మ‌రి ఫ్లాప్ తో వెలిగిన జ్ఞాన‌బ‌ల్బు హిట్ దారిని చూపిస్తుందా..?

More Related Stories