English   

మామా అల్లుళ్ల మ‌ధ్య బాబీ.. 

Venktesh-chai
2018-03-20 15:32:41

బాబీ.. ఈ పేరు ఎక్క‌డో విన్న‌ట్లుంది క‌దా..! ఎందుకుండ‌దు ఒక‌టి రెండు కాదు మూడు సినిమాలు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. పైగా అన్నీ స్టార్ హీరోల తోనే. అందులో రెండు బాగా ఆడాయి కూడా. ప‌వ‌ర్ తో ద‌ర్శ‌కుడిగా మారి.. స‌ర్దార్ తో తొలి డిజాస్ట‌ర్ ఇచ్చి.. జై ల‌వ‌కుశ‌తో ఓకే అనిపించాడు బాబీ. ఈ ట్రాక్ రికార్డ్ ఉండి కూడా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. ఇన్నాళ్లూ ఆ హీరోతో చేస్తాడు.. ఈయ‌న‌తో చేస్తాడు అనే టాక్స్ తోనే స‌రిపోయింది. ఇప్పుడు ఈయ‌న ఓ మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. నాగ‌చైత‌న్య‌, వెంక‌టేశ్ హీరోలుగా ఓ సినిమా లైన్ లో ఉంద‌ని తెలుస్తుంది. అప్ప‌ట్లో ఇదే కాంబినేష‌న్ లో క‌ళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తాడ‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఇప్పుడు ఆయ‌న ర‌వితేజ నేల‌టికెట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌య్యే స‌రికి మ‌రో మూడు నెల‌లైనా అవుతుంది. దాంతో ఈయ‌న స్థానంలోకి ఇప్పుడు బాబీ వ‌చ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంపై బాబీ కూడా ఏమీ మాట్లాడ‌లేదు. ఇప్ప‌టికే చైతూ, వెంకీకి క‌థ చెప్పి ఈ ద‌ర్శ‌కుడు ఒప్పించాడ‌ని తెలుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు సినిమా ప‌ట్టాలెక్క‌డం మాత్రం క‌ష్ట‌మే. ఎందుకంటే ఇప్పుడు స‌వ్య‌సాచి.. శైల‌జారెడ్డి అల్లుడుతో పాటు శివ‌నిర్వాన సినిమాల‌తో బిజీగా ఉన్నాడు చైతూ. ఇవ‌న్నీ పూర్తైతే కానీ బాబీకి డేట్స్ ఇవ్వ‌డం క‌ష్టం. మ‌రి చూడాలిక‌.. ఈ మామా అల్లుళ్ల‌ను బాబీ ఎలా మేనేజ్ చేస్తాడో..?

More Related Stories