English   

వార్నీ..ఈ డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడా..?

Venky-Kudumula
2018-05-23 15:00:22

ఏ దర్శకుడైనా ఒక్క హిట్ ఇస్తే చాలు.. వెంటనే బ్లాంక్ చెక్స్ తో వెంటపడతారు నిర్మాతలు. ఇది మామూలుగా ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అలా ఆ మధ్య ఫిబ్రవరి వెంకీస్ అంటూ వచ్చిన ఇద్దరు వెంకీస్ లో ఒకరు ఆల్రెడీ సినిమా చేస్తుంటే మరో వెంకీ ఇప్పటి వరకూ ఖాళీగానే ఉన్నాడు. కుర్రాడికి చాలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి అని ఆ టైమ్ లోచాలా హడావిడీ చేశారు. కానీ తీరా చూస్తే ఇప్పుడంత సీన్ లేదా అనిపించేట్టుగా ఉంది వ్యవహారం. నాగశౌర్య ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల.. ఇతనికి ఇదే ఫస్ట్ మూవీ. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ కామెడీకి మరో త్రివిక్రమ్ అన్నంత పని చేశారు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఇక వెంకీ సెటిల్ అయినట్టే అనుకున్నారు. అయితే అదే నెలలో వచ్చిన తొలిప్రేమ సినిమాతో మరో వెంకీ అట్లూరి ఇప్పుడు సెకండ్ మూవీ అఖిల్ తో చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ వెంకీ మాత్రం ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తోంది. 

వెంకీ కుడుములకు అప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఆఫర్ వచ్చిందని వినిపించింది. ఓ ప్రముఖ హీరోతో సినిమా అని కూడా అన్నారు. కానీ ఇప్పుడా ప్రముఖ హీరో పేరు సాయిధరమ్ తేజ్ గా వినిపిస్తోంది. అంటే వెంకీ కుడుముల నెక్ట్స్ మూవీ సాయిధరమ్ తేజ్ తో అన్నమాట. కానీ ఇందులో ఎంత నిజముందనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పుడు తేజూ వెనక చాలామంది దర్శకుల పేర్లు క్యూలో ఉన్నాయి. చంద్రశేఖర్ ఏలేటి, కిశోర్ తిరుమల, గోపీచంద్ మలినేని.. ఇలా లిస్ట్ పెద్దదే. ఇప్పుడీ లిస్ట్ లోకి వెంకీ కుడుముల చేరాడు. ఒకవేళ అతని కథ నచ్చి వెంకీతోనే ముందు సినిమా చేసినా..  అందరూ అనుకుంటున్నట్టు.. అతను ఇప్పటి వరకూ బిజీగా ఏం లేడు.. మరో హీరోను వెదుక్కుంటూ ఖాళీగానే ఉన్నాడు. ఏదేమైన ఛలో తర్వాత ఎక్కడికో వెళతాడు అనుకున్న వెంకీ ఇంకా ఎక్కడికీ వెళ్లలేదన్నమాట.. 

More Related Stories