English   

దేవుడా.. నాని ఖాతాలో ఇంకోటి.. 

Venky-Kudumula
2018-03-16 16:42:20

ఏం జ‌రుగుతుంది.. అస‌లేం జ‌రుగుతుంది.. ఇక్క‌డ హీరోలు ఒక్క క‌థ దొర‌క‌డానికే నానా తంటాలు ప‌డుతున్నారు. కానీ నానికి మాత్రం కుప్ప‌లు కుప్ప‌లుగా క‌థ‌లు దొరుకుతున్నాయి. దొరికిన క‌థ‌ల‌న్నీ హిట్ అవుతున్నాయి. ఈ కిటుకు తెలియ‌క చాలామంది హీరోలు తిక‌మ‌క‌ప‌డుతున్నారు.  కానీ నాని మాత్రం హాయిగా దూసుకెళ్లిపోతున్నాడు. తెలుగు ఇండ‌స్ట్రీ అనేది మ‌హాస‌ముద్రం. ఇక్క‌డ స్టార్స్ అంతా వార‌సులే. ఆల్రెడీ ఎప్ప‌ట్నుంచో పాతుకుపోయిన సామ్రాజ్యాలే ఇక్క‌డ ఉన్నాయి. ఈ స్టార్ హీరోల వార‌సులే మ‌ళ్ళీ స్టార్స్ గా వ‌స్తున్నారు. ఇలాంటి చోట అస‌లు బ‌య‌టి వాళ్ళ‌కు వ‌చ్చే ఛాన్సే లేకుండా పోయింది. ఈ స‌మ‌యంలో నాని మాత్రం రాకెట్ లా దూసుకొచ్చాడు. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. క్లాప్ అసిస్టెంట్ గా కూడా చేసి.. హీరోగా మారి.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో ఒక్క‌డిగా నిలిచాడు నాని. 

ఇప్పుడు నాని సినిమా వ‌స్తుందంటే ఇంకో మాట లేకుండా హిట్ అనాల్సిందే. అంత‌గా నాని ఇప్పుడు దున్నేస్తున్నాడు. న్యాచుర‌ల్ స్టార్ నుంచి సూప‌ర్ స్టార్ గా అడుగులేస్తున్నాడు నాని. ఓ చిరంజీవి.. ర‌వితేజ‌.. ఇప్పుడు నాని. గ‌త కొన్ని ద‌శాబ్ధాల తెలుగు ఇండ‌స్ట్రీని తీసుకుంటే వీళ్ళు త‌ప్ప మ‌రో స్టార్ ఎవ‌రూ అండ లేకుండా ఎద‌గ‌లేదు. ఇప్పుడు నాని వ‌చ్చాడు ఈ లిస్ట్ లోకి. వ‌ర‌స‌గా ఎనిమిది విజ‌యాలు అందుకుని ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు నాని. ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్ధంతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు నాగార్జున‌తో శ్రీరామ్ ఆదిత్య మ‌ల్టీస్టార‌ర్.. హ‌ను రాఘ‌వ పూడి సినిమా.. విక్ర‌మ్ కే కుమార్ సినిమాలకు క‌మిట‌య్యాడు నాని. ఇవ‌న్నీ ఉండ‌గానే ఇప్పుడు వెంకీ కుడుముల‌తోనూ ఓ సినిమా చేస్తున్నాడు అనే వార్త‌లొస్తున్నాయి. ఛ‌లోతో సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వెంకీ. హారిక హాసిని బ్యానర్ లో నాని-వెంకీ సినిమా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. నానితో వెంకీ ఏం ఛ‌లో అనిపిస్తాడో..? 

More Related Stories