English   

వెంకీ మామ పబ్లిక్ టాక్.. చైతూతో మామ హిట్ కొట్టాడా..

Venky Mama First Talk
2019-12-13 11:26:19

అటు వెంకటేష్.. ఇటు అక్కినేని అభిమానులు చాలాకాలంగా వేచి చూస్తున్న సినిమా వెంకీ మామ. బాబీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలైంది. అమెరికాలో ప్రీమియర్స్ పడటంతో అసలు టాక్ కూడా బయటికి వచ్చేసింది. ఈ చిత్రం వాళ్లు చెప్పినంత అద్భుతంగా లేకపోయినా కూడా బాబీ మాత్రం ఓ సారి హాయిగా చూసేలా తెరకెక్కించాడని తెలుస్తుంది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా కామెడీతో పాటు ఎమోషన్స్ కలిపి ఫ్యామిలీ డ్రామాను బాగానే పండించినా కూడా సెకండాఫ్ మాత్రం కాస్త గాడి తప్పినట్లు చెబుతున్నాడు ఆడియన్స్. అల్లుడి కోసం వెంకీ మిలటరీకి వెళ్లడం అక్కడ జరిగే పరిస్థితులు కథలో కాస్త వేగాన్ని తగ్గించాయని.. అయితే చైతూ, వెంకీ కాంబినేషన్ మాత్రం సినిమాకు శ్రీ రామరక్ష అంటున్నారు ప్రేక్షకులు. హీరోయిన్లు పెద్దగా వర్కవుట్ కాలేదని చెబుతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్ కారెక్టర్ కామెడీగా ఉన్నా కూడా ఆమె ఆ పాత్రకు సూట్ కాలేదనే టాక్ వినిపిస్తుంది. ఇక చైతూ మరోసారి తనదైన పాత్రలో రెచ్చిపోయాడు. వెంకటేష్ కూడా అల్లుడి కోసం అన్నీ త్యాగం చేసే పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. మొత్తంగా వెంకీ మామ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగానే అట్రాక్ట్ చేసేలా కనిపిస్తుంది. అయితే రూరల్ ఏరియాల్లో మాత్రమే వెంకీ మామ హవా కనిపించేలా ఉందంటున్నారు ఆడియన్స్. మరి మెట్రో సిటీస్ లో కూడా వెంకీ దుమ్ము దులిపేస్తాడో లేదో చూడాలంటే కాస్త టైమ్ పడుతుంది. 

More Related Stories