English   

మండు వేసవిలో మంచుకొండల్లో వెంకీ మామ

venkymama
2019-05-19 16:51:30

నిజజీవితంలో మామా అల్లుళ్ళు అయిన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు తెర మీద కూడా మామా అల్లుళ్ళుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. జై లవ కుశ ఫేం రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు మూడో షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సినిమా యూనిట్ త్వరలో మూడో  షెడ్యూల్ షూటింగ్ ని కశ్మీర్లో ప్రారభించనుందట. అది ఈ నెల 20 నుండి జరగనుందని అంటున్నారు. ఇక ఈ షెడ్యూల్ ఏకంగా ఇరవై ఐదు రోజుల పాటు అక్కడే జరగనుందట. ఇక ఈ సినిమాలో చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండగా ఆయనకు సంబందించిన షూట్ అక్కడ జరుగుతుందని అంటున్నారు. దీంతో ఈ షెడ్యూల్ లో వెంకీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఏదేమైనా మండు వేసవిలో మంచు కొండల్లో వెంకీ మామ(యూనిట్) ఎంజాయ్ చేయనుందన్నమాట.

More Related Stories