English   

మరో వారంలో మామా అల్లుళ్లు మొదలుపెడుతున్నారు

Venky-Mama
2018-12-04 14:14:56

ఇండస్ట్రీ అంతా వారసుల మయం. స్టార్స్ నుంచి మినీ స్టార్స్ వరకూ వారసులదే హవా. హిట్స్ వచ్చినా, ఫ్లాపులు వస్తున్నా.. వారిదే మొదటి స్థానాలుగా నిలుస్తున్నాయి. ఇక ఆ నెపోటిజం కు ఆడియన్స కూడా అలవాటు పడిపోయారు. అందుకే వస్తోన్న ప్రతి హీరోను ఆదరిస్తున్నారు. సినిమా బావుంటే వాళ్లు నిలుస్తున్నారు. లేదంటే వెనకబడుతున్నారు.  ఈ క్రమంలో వారి ఫ్యామిలీ హీరోల మధ్యే వస్తోన్న కొన్ని కాంబినేషన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో స్టార్ ఫ్యామిలీస్ నుంచి కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దగ్గుబాటి అండ్ మెగా కాంబో హీరోలైన వెంకీ అండ్ వరుణ్ తేజ్ లు కలిసి ‘ఎఫ్-2’ అనే సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి మరో కాంబో తెరపైకి రాబోతోంది.  

అదే వెంకటేష్ అండ్ నాగ చైతన్య. పైగా ఈ ఇద్దరికీ బ్లడ్ రిలేషన్ కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ క్రేజీగా మారింది. ఈ మూవీకి ఇప్పటికే ‘‘వెంకీ మామ’’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. కానీ అఫీషియల్ గా అనౌన్స్ అవలేదు. గతంలో చైతూ బ్లాక్ బస్టర్ ‘ప్రేమమ్’ లో  అదే పాత్రలో వెంకటేష్ చిన్న గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. దానికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఏకంగా ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే అదే రేంజ్ లో ఆసక్తి కూడా ఉంది.  

ఫస్ట్ మూవీతో బెస్ట్ హిట్ కొట్టి నెక్ట్స్ మూవీతో ఇబ్బంది పడ్డ దర్శకుడు బాబీ లాస్ట్ ఇయర్ జై లవకుశతో మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. అతని దర్శకత్వంలో వెంకీ అంటూ చైతూ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ ప్రాజెక్ట్ గతంలోనే అనౌన్స్ అయింది. అయితే లేటెస్ట్ గా ఆరంభ టైమ్ కూడా అనౌన్స్ అయింది. ఈ నెల 12న ఈ మూవీ అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం వెంకీ చేస్తోన్న ఎఫ్ 2 చివరి దశలో ఉంది. చైతూ, సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే ముందుగా వెంకీ పార్ట్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇక వెంకీ సరసన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ నటిస్తుండగా.. చైతూ సరసన రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్టు టాక్. 

More Related Stories