English   

సీనియర్ నటి కన్నుమూత.. వెంకటేష్ సినిమాతో గుర్తింపు..

Kishori Ballal died
2020-02-19 15:20:15

ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. సీనియర్ నటులు ఒక్కొక్కరుగా మనకు దూరమవుతున్నారు. ఇప్పుడు కూడా ఓ సీనియర్ నటి కన్నుమూసింది. తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటి కిషోర్ బల్లాల్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె వయసు 82 ఏళ్లు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా ఈమె నటించారు.

 ముఖ్యంగా 2004లో షారుక్ ఖాన్‌ హీరోగా నటించిన 'స్వదేశ్‌' చిత్రంలో ఆయనకు అమ్మగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు కిషోరి. ఆ సినిమాలో కావేరీ అమ్మగా ఆమె నటనకు ఉత్తరాది ప్రేక్షకులు కూడా నీరాజనం పట్టారు. ఆ తర్వాత కూడా కొన్ని హిందీ సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా చేయలేదు ఈమె. ఆ తర్వాత తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో నటించారు. అందులో వెంకీతో ఈమెకు ఉండే సన్నివేశాలు నవ్వుతో పాటు ఏడుపు కూడా తెప్పిస్తాయి. 

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న కిషోరి.. ఫిబ్రవరి 18న కన్నుమూసారు. ఈమె మరణంతో కన్నడ పరిశ్రమలో విషాదం నెలకొంది. 1960లో 'ఇవలెంత హెందాతీ' చిత్రంతో వెండతెర తెరంగ్రేటం చేశారు కిషోరి. ఆ తర్వాత కూడా ‘అయ్య', 'కెంపేగౌడ', 'నమ్మణ్ణ', 'గేర్‌ కానూని' లాంటి చాలా కన్నడ సినిమాుల చేసారు ఈమె. కన్నడలో విష్ణువర్ధన్‌, అంబరీష్‌, ప్రభాకర్‌, దర్శన్‌, సుదీప్‌ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు కిషోరి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈమెకు కెంపేగౌడ ప్రశస్తి, కన్నడ అకాడమీ ప్రశస్తి, ఐఫా ప్రశస్తి లాంటి ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించింది కూడా. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

More Related Stories