English   

16 ఏళ్ల త‌ర్వాత వ‌స్తున్న మ‌హేశ్ సినిమా.. 

Takkari-Donga-mahesh
2018-03-09 15:27:41

అవును.. అప్పుడెప్పుడో 2002లో వ‌చ్చిన ఓ సినిమా ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అది కూడా మ‌హేశ్ బాబు లాంటి సూప‌ర్ స్టార్ సినిమా. అవునా.. ఇన్నాళ్లూ ఈ సినిమా ఎందుకు విడుద‌ల కాలేదు..? అస‌లు అలాంటి సినిమా మ‌హేశ్ కెరీర్ లో ఏముంది అనుకుంటున్నారా..? ఇది జ‌రుగుతున్న‌ది తెలుగులో కాదు.. త‌మిళ‌నాట‌. ఈ మ‌ధ్య కాలంలో మ‌న హీరోల‌కు త‌మిళ మార్కెట్ పై మోజు ఎక్కువైపోయింది. అక్క‌డ మ‌న సినిమాల‌కు మంచి గిరాకీ ఉండ‌టంతో ఇక్క‌డ ఎప్పుడో వ‌చ్చిన సినిమాల‌ను కూడా డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. అలా ఇప్పుడు ట‌క్కరిదొంగ సినిమాను తీసుకొస్తున్నారు. మార్చ్ 10న ట‌క్క‌రిదొంగ త‌మిళ వర్ష‌న్ విడుద‌ల కానుంది. స్పైడ‌ర్ తో త‌మిళ ప్రేక్ష‌కుల‌కు నేరుగా ప‌రిచ‌యం అయ్యాడు మ‌హేశ్. ఈ సినిమా ఫ్లాపైనా కూడా ముఖ ప‌రిచ‌యం అయితే అయింది. పైగా సొంత డ‌బ్బింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. ఈ క్రేజ్ చాలు అనుకున్నారో ఏమో కానీ వ‌ర‌స‌గా మ‌హేశ్ పాత సినిమాల‌కు దుమ్ము దులిపేస్తున్నారు. ఇప్పుడు అలా దొరికిందే ట‌క్క‌రి దొంగ‌. జ‌యంత్ సి ప‌రాన్జీ తెర‌కెక్కించిన ఈ చిత్రం తెలుగులోనే డిజాస్ట‌ర్. మ‌రి త‌మిళ‌నాట ఏం చేస్తుందో చూడాలిక‌..! అన్న‌ట్లు ఈ సినిమాకు పోటీ రామ్ చ‌ర‌ణ్ నాయ‌క్ సినిమా విడుద‌ల కానుంది. దీనికి అక్క‌డ రౌడీనాయ‌క్ అని పేరు పెట్టారు.

More Related Stories