English   

శ్రీనివాసుడికి వెంకటేష్ సాయం 

Srinivasa-Kalyanam
2018-08-04 15:37:12

వాయిస్ ఓవర్.. ఓ సినిమాకు మరో స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మనకు ఎప్పటి నుంచో ఉంది. కథను నడిపించడానికి.. లేదంటే కథలో హైలెట్స్ చెప్పడానికి ఈ వాయిస్ ఓవర్స్ ఉపకరిస్తాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కూడా చాలా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. రీసెంట్ గా సాక్ష్యం సినిమాకూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ప్లస్ అయింది. అలా ఇప్పుడు దిల్ రాజు నిర్మించిన శ్రీనివాస కళ్యాణం కు విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన శ్రీనివాస కళ్యాణం ఈ నెల 9న విడుదల కాబోతోంది. శతమానం భవతి వంటి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. దిల్ సినిమా తర్వాత ఇన్నాళ్లకు దిల్ రాజు బ్యానర్ లో నితిన్ నటించిన సినిమా ఇది. కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వస్తోన్న ఈ సినిమాకు మరో ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆకట్టుకునే అంశమే. వెంకీ వాయిస్ ఓవర్ ఖచ్చితంగా ఈ సినిమాకు ప్లస్ అవుతుందనుకోవచ్చు. ఇక వెంకటేష్ కూడా ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమాలోనే నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోన్న ‘ఎఫ్-2’ అనే సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు వెంకీ. ఆ ఇది కొద్దీ ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని వేరే చెప్పక్కర్లేదేమో.. 
 

More Related Stories