English   

లెక్చరర్ గా వస్తోన్న వెంకీ మామ

Victory Venkatesh
2020-10-20 10:54:15

తెలుగులో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం తమిళ్ లో సూపర్ హిట్ అయిన "అసురన్" రీమేక్ "నారప్ప"లో వెంకటేష్ నటిస్తున్నాడు. నారప్ప సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత వెంకటేష్ దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాలో నటించనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంబినేషన్ కు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ పూర్తి చేసి వినిపించగా వెంకీ మామ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ కాలేజీ లెక్చరర్ పాత్రలో నటించానున్నారట. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమయింది లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్ గా తరుణ్ పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా వెంకటేష్ సినిమాలంటే కేవలం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తారు. ఎందుకంటే వెంకటేష్ కామెడీ టైమింగ్ అంటే ప్రేక్షకులకు చాలా ఇష్టం. అందుకోసం వెంకటేష్ కూడా ఎక్కువగా మాస్ సినిమాలు కాకుండా ఎంటర్టైనింగ్ గా ఉన్న సినిమాల్లో నటిస్తారు.

More Related Stories