విద్యాబాలన్ ఎలా ఒప్పుకుందబ్బా..?

ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడానికి విద్యాబాలన్ ఒప్పుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఇన్నాళ్లూ చాలా మంది ఈ భామను తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావడానికి ట్రై చేసారు. ఖైదీ నెం.150 నుంచి సైరా వరకు చిరంజీవి కూడా విద్యా కోసం బాగానే ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. ఇక శాతకర్ణి కోసం బాలయ్య అడిగినా కూడా నో చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో విద్యాబాలన్ నటిస్తుందని తెలియగానే అంతా షాక్ అవుతున్నారు. అసలు ఎలా ఈ చిత్రంలో బసవతారకం పాత్ర చేయడానికి విద్య ఒప్పుకుంది అని..? దీనికి కారణం క్రిష్.. అవును.. ఇప్పుడు బాలీవుడ్ లో క్రిష్ కు ఓ మార్కెట్ ఉంది.. ఆయనంటే గుర్తింపు ఉంది. ఇప్పటికే గబ్బర్ ఈజ్ బ్యాక్ తో తనను తను నిరూపించుకున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు కంగనతో మణికర్ణిక సినిమా చేస్తున్నాడు. ఈయన పనితనం గురించి తెలుసుకున్న తర్వాతే విద్యా సైతం క్రిష్ తో పని చేయడానికి ఓకే అనేసిందని తెలుస్తుంది. పైగా ఈ పాత్రను తాను చాలా ప్రస్టేజియస్ గా తీసుకుంటుంది విద్యాబాలన్. ఎన్టీఆర్ జీవితంలో కీలకపాత్ర పోషించింది బసవతారకం. ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నపుడు 13 మంది సంతానాన్ని తానే చూసుకుని పెంచింది బసవ తారకమ్మ. అలాంటి పాత్ర చేయాలంటే కచ్చితంగా చాలా అనుభవం ఉన్న నటి కావాల్సింది. క్రిష్ కూడా ఆమెకు చెప్పిన విధానం అలా ఉంది. దాంతో మరో మాట లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి ఒప్పుకుంది విద్యాబాలన్. అన్నట్లు శాతకర్ణి కోసం హేమామాలినిని తీసుకొచ్చాడు క్రిష్. ఇక ఇప్పుడు విద్యాబాలన్ వస్తుంది. మరి చూడాలిక.. ఈమె పాత్ర ఎలా ఉండబోతుందో..?