English   

ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్ లుక్ ఇదే

Vidya-balan-NTR
2018-07-01 15:50:52

తెలుగువారి ఖ్యాతిని దిగంతాలకు చాటిన మహానటుడు నందమూరి తారకరామావు. పొలిటికల్ గానూ ఆయన సూపర్ హిట్ అయ్యారు. అనూహ్య పరిస్థితుల్లో ఆఖరి ఘడియలు కాస్త బాధాకరంగా సాగినా.. తెలుగువారి అన్నగా ఆయన స్థానం మరెవరూ భర్తీ చేయలేనిది. అంతటి మహావ్యక్తి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించాలంటే ఆయన తనయులకు కాక మరెవరికి సాధ్యమవుతుంది. అందుకే ఆయన వారసుడు బాలకృష్ణ.. తండ్రి జీవితాన్ని బయోపిక్ గా తీసుకువస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్ర కూడా ఆయనదే. 

ఎన్టీఆర్ అనే టైటిల్ తోనే తెరకెక్కబోతోన్న ఈ సినిమాక సెన్సిటివ్ డైరెక్టర్ క్రిష్ నిర్దేశకుడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఇతర తారాగణం ఎంపిక జరుగుతోన్న ఈ మూవీలో అత్యంత కీలక పాత్రలో విద్యా బాలన్ నటించబోతోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో ఆమె నటించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇది నిజమే అని విద్యాబాలన్ కూడా కన్ఫార్మ్ చేసింది. ఆ మేరకు ఈ పాత్రకు సంబంధించిన హోమ్ వర్క్ కూడా స్టార్ట్ చేసిందీ చబ్బీ బ్యూటీ. మొత్తంగా గతంలో సిల్క్ స్మిత బయోపిక్ డిర్టీ పిక్చర్ లోనటించి నేషనల్ అవార్డ్ అందుకున్న విద్యాబాలన్ ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన భార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకుని కొంత సర్ ప్రైజ్ చేసినా.. తను పాత్ర బాలేకుంటే ఒప్పుకోదని అందరికీ తెలుసు. అంటే బసవతారకం పాత్రను క్రిష్ ఏ స్థాయిలో మలిచాడో ఊహించుకోవచ్చు. 

More Related Stories