మార్చ్ లో అయినా నయన్ విగ్నేష్ పెళ్లి జరుగుతుందా

కోలీవుడ్ ప్రేమ జంట నయనతార విగ్నేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే పెళ్లి వార్తలపై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు గానీ తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి లవ్ లో ఉన్నట్టు స్పష్టం చేసాయి. ఇక నయన్ విగ్నేష్ లు ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గతం లో కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. కానీ ఫిబ్రవరిలో ఏ జంట పెళ్లి పీటలెక్కలేదు. ఇక ఇప్పుడు మార్చ్ లో ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కూడా నయన్ విగ్నేష్ లు స్పందించడంలేదు. దాంతో అసలు ఈ జంట పెళ్లి చేసుకుంటుందా లేదా.? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దానికి కారణం ఈ జంట స్పందించకపోవడం మాత్రమే కాదు. గతంలో నయనతార ప్రభుదేవా తో కూడా ప్రేమాయణం నడిపింది. వీరి ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఈనేపథ్యంలోనే నయన్ విగ్నేష్ పెళ్లి పై అనుమానాలు మొదలివుతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.