English   

విజయ్ దేవరకొండ రౌడీ ప్రవర్తన మార్చుకోడట..!

Vijay Devarakonda Accepted Flop but Vijay Can not Change his Rowdy Attitude
2018-10-11 09:38:43

కొంద‌రు హీరోల‌కు ఎప్పుడూ వార్త‌ల్లో నిల‌వ‌డం ఇష్టం. అది ఎలాగైనా స‌రే.. కొన్ని రోజులు హిట్ల‌తో నిలుస్తారు.. మ‌రికొన్ని రోజులు సంచ‌ల‌నాల‌తో నిలుస్తారు.. కానీ ఏం చేసినా వాళ్ల‌ను మాత్రం ప్రేక్ష‌కులు మ‌రిచిపోకూడ‌దు. అదే వాళ్ల మోటో. ఇప్పుడు విజ‌య్ దేర‌వ‌కొండ కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తాడు. ఈయ‌న కూడా కావాల‌నే ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కు తాను ఒకన్ని ఉన్నానని గుర్తు చేస్తుంటాడు. నిజానికి అంత అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇమేజ్ అలా ఉంది. అయితే ఈ మ‌ధ్యే గీత‌గోవిందం బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత దాన్ని మ‌రిపించేలా నోటాతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఈ చిత్రం క‌నీసం 15 కోట్లు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సాలిడ్ ఫ్లాప్ వ‌చ్చింది. ఇదే ఫ్లాప్ బేస్ చేసుకుని ట్విట్ట‌ర్ లో లెట‌ర్ రాసాడు విజ‌య్.

నోటా సినిమా చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా.. క‌థ న‌చ్చే చేసాను.. కాక‌పోతే అప్పుడ‌ప్పుడూ తేడా కూడా కొడుతుంటుంది.. మీ సూచ‌న‌లు తీసుకుంటాను.. అదే నాకు కూడా కావాలి.. అయినా ఒక్క ఫ్లాప్ వ‌చ్చింద‌ని నా ఆటిట్యూడ్ మార‌దు.. రౌడీస్ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు.. విజ‌యం కోసం పోరాడ‌తాం.. నా ఫ్లాప్ కోసం చాలా మంది చూస్తున్నారు క‌దా పండ‌గ చేస్కోండి.. మ‌ళ్లీ ఆ ఛాన్స్ మీకు ఇవ్వకుండా.. వ‌స్తానంటూ రాసుకొచ్చాడు విజ‌య్. ఈయ‌న ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచ‌నాలు అంత భారీగా ఏం లేవు కానీ దీనిపై విజ‌య్ మాత్రం భారీ న‌మ్మ‌కాలే పెట్టుకున్నాడు. ఇక ట్యాక్సీవాలా ఎప్పుడు విడుద‌ల అవుతుందో ఆయ‌న‌కే తెలియ‌దు. ఇంత జ‌రిగినా కూడా విజ‌య్ మాత్రం కావాల‌నే ఈ ర‌చ్చంతా చేస్తున్నాడు. ఏదేమైనా వార్త‌ల్లో ఉండాల‌నే విజ‌య్ ఆశ చూసి కొంద‌రు విమ‌ర్శిస్తుంటే.. మ‌రికొంద‌రు ఫెయిల్యూర్ ఒప్పుకున్న తీరు చూసి ప్ర‌శంసిస్తున్నారు.

More Related Stories