English   

విజయ్ దేవరకొండ లైగర్ ఫస్ట్ లుక్ 

Vijay devarakonda
2021-01-18 11:56:33

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజన్నాథ్ దర్శకత్వంలో ఓ  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినట్టు సమాచారం. అప్పట్లో సినిమా షూటింగ్ పిక్ కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమాను ఛార్మి, పూరిజగన్నాథ్ కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ తో రొమాన్స్ చేయనుంది.  

ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ నిన్న (శనివారం )ప్రకటించింది.  చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 10 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ ను , టైటిల్ ను అనౌన్స్ చేసారు. "లైగర్ " పేరుతో టైటిల్ ను ప్రకటించారు. ఆడ పులి మగ సింహానికి పుట్టిన జంతువుని లైగర్ అని పిలుస్తారు. ఇక పోస్టర్ లో విజయ్ ఫస్ట్ లుక్ చూస్తే టైటిల్ కు తగినట్టుగా గర్జిస్తున్నాడు. సినిమాలో బాక్సర్ గా కనిపించనున్న విజయ్ ఫస్ట్ లో బాక్సింగ్ గ్లౌస్ లు తొడుక్కుని యుద్దానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ లుక్ చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Related Stories