English   

విజయ్ దేవరకొండకు నచ్చలేదట

Vijay Devarakonda Didn't like Geetha Govindam Story
2018-08-20 06:44:47

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థల ఎంపికపై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ కుర్రాడు క‌థ ఓకే చేసాడంటే అందులో క‌చ్చితంగా ఏదో విష‌యం ఉంటుంద‌ని అనుకుంటున్నారు. అయితే త‌న‌కు క‌థల ఎంపిక‌లో అంత సీన్ లేద‌ని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు ఈ కుర్ర హీరో. గీత గోవిందం స‌క్సెస్ మీట్ లో త‌న ఇజ్జత్ త‌నే తీసుకున్నాడు విజ‌య్. ముందు ఈ సినిమా క‌థ త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చి ప‌రుశురామ్ చెప్పిన‌పుడు ఏదో ఉందిలే అనుకున్నాన‌ని.. చేయకూడ‌ద‌నే అనుకున్నాన‌ని చెప్పాడు విజ‌య్. అయితే నిర్మాత బ‌న్నీవాసు వ‌చ్చి నీ త‌ర‌హా సినిమాలు నువ్వు చేయ్ కానీ ఒక్క‌సారి ఇలాంటి క‌థ కూడా చేస్తే కుటుంబ ప్రేక్ష‌కుల‌కు కూడా చేరువ‌వుతావ్ అని చెప్పడంతో మ‌రో మాట లేకుండా చేసిన‌ట్లు చెప్పాడు విజ‌య్.

ఈయ‌న ఇంత ధైర్యంగా ఈ క‌థ నాకు న‌చ్చ‌లేదు.. నిర్మాత చెప్పినందుకే చేసాను.. లేదంటే మిస్ అయిపోయేవాడిని అంటూ చెప్ప‌డంతో మ‌నోడిపై ఇంప్రెష‌న్ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు గీత‌గోవిందం క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం ఐదు రోజుల్లోనే 30 కోట్ల షేర్ వైపు ప‌రుగు తీస్తుంది. మ‌న ఇండ‌స్ట్రీలో సినిమా హిట్టైతే త‌న క్రెడిట్ అని.. ఫ్లాప్ అయితే ద‌ర్శ‌కుడు అని దొబ్బే హీరోలుంటారు. కానీ విజ‌య్ మాత్రం ఈ సినిమాలో న‌ట‌న కూడా ప‌రుశురామ్ చెప్పిన‌ట్లు చేసానంతే అంటూ మొత్తం క్రెడిట్ ఆయ‌న‌కే ఇచ్చాడు. మొత్తానికి ఇలాంటి హీరోలు కూడా ఇండ‌స్ట్రీలో ఉండాలిలే.. లేదంటే ద‌ర్శ‌కుల‌కు అస్స‌లే విలువ లేకుండా పోతుంది.

More Related Stories