English   

బాలీవుడ్ హీరోలను వణికిస్తోన్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Dominated Bollywood Star Heroes Stardom
2018-08-20 15:58:19

విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. తెలుగు స్టార్ కాబట్టి మనదగ్గర వినిపిస్తే ఓకే అనుకోవచ్చు. కానీ బాలీవుడ్ లో కూడా విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే మనోడు ఏకంగా అక్కడి సూపర్ స్టార్ అయిన అక్షయ్ కుమార్ కే షాక్ ఇచ్చాడు. అంతేకాదు.. అక్కడ మీడియం రేంజ్ స్టార్ అయిన జాన్ అబ్రహాం కూడా విజయ్ దెబ్బకు షాక్ అయిపోతున్నాడు. యస్.. మనోడు ఆ రేంజ్ లో ఆస్ట్రేలియా లో ఈ రెండు సినిమాలను డామినేట్ చేస్తున్నాడు మరి.

అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘గోల్డ్’. స్వాతంత్ర్యానంతరం హాకీ గేమ్ నేపథ్యంలోవచ్చిన సినిమా ఇది. ఇక జాన్ అబ్రహాం సినిమా ‘సత్యమేవ జయతే’. ఈ రెండు సినిమాలకూ బాలీవుడ్ లో మంచి రివ్యూసే వచ్చాయి. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ రెండు సినిమాలకూ గీత గోవిందం గట్టి పోటీ ఇస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ వంటి స్మాల్ హీరో ఆ ఇద్దరు స్టార్ హీరోల సినిమాతో పోటీ పడి మరీ కలెక్షన్స్ సాధిస్తోందంటే గీత గోవిందం బ్లాక్ బస్టర్ కు ఇంతకు మించిన నిదర్శనం ఏముందీ..?

ఇక ఈ సినిమా సూపర్ హిట్ అని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ మరీ ఇలా అక్షయ్ కుమార్ సినిమాకే పోటీ ఇస్తుందా.. నిర్మాతల బడాయి కాకపోతే అనుకోవడానికి లేదు. ఇది ఈ సినిమా దర్శక నిర్మాతలో లేక ఇక్కడి మీడియానో చెప్పిన విషయం కాదు.. బాలీవుడ్ టాప్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ ఇక్కడే కాదు.. బాలీవుడ్ లోనూ వైరల్ అవుతోందిప్పుడు. 
మరోవైపు గీత గోవిందం ఓవర్శీస్ లో ఒన్ మిలియన్ మార్క్ పూర్తి చేసుకుంది. అయినా ఏ మాత్రం స్పీడ్ తగ్గలేదు. దీంతో ఈజీగా టూ మిలియన్ డాలర్స్ వసూలు చేయడం ఖాయం అంటున్నారు. అదే నిజమైతే విజయ్ దేవరకొండ స్టార్డమ్ మరింత పెరిగినట్టే అనుకోవాలి.

More Related Stories