English   

విజయ్ దేవరకొండ లుంగీబాబా అవతారం

Vijay Devarakonda Lungi Avatar at Geetha Govindam Audio Launch
2018-07-30 06:25:50

విజయ్ దేవరకొండ లుంగీబాబాలా మారాడు. ఇప్పటి వరకూ స్టైలింగ్ లో కొత్తతరహా పోకడలు పోతోన్న విజయ్ గీత గోవిందం ఆడియో ఫంక్షన్ కు లుంగీతో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రమైన(కొన్నిసార్లు సగంబట్టలతో కూడా) డ్రెస్సింగ్ తో పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపిస్తోన్న విజయ్ దేవరకొండ తన సినిమా ఆడియో ఫంక్షన్ కు ఇలా లుంగీలో రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిర్మాత బన్నీ వాసు అయితే విజయ్ కేసి ఎగాదిగా చూస్తూ అదోరకం ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫీలింగ్ ఎక్స్ ప్రెస్ చేశాడు. ఇక అల్లు అరవింద్ ఏకంగా అతని లుంగీని పట్టుకుని.. పైకీ కిందకిఅంటూ ఇదేం డ్రెస్ రా బాబు అనే రేంజ్ లో ఏదో మాట్లాడుతూ కనిపించాడు.. మొత్తంగా చాలా సందడిగా మొదలైన ఈ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ లుంగీ టాక్ ఆఫ్ ది ఆడియోగా మారిపోయింది.

More Related Stories