English   

విజయ్ దేవరకొండ వల్ల ప్ర‌భాస్ ఫ్రెండ్స్ కు నష్టం

Vijay Devarakonda Geetha Govindam Releasing first after that Taxiwala
2018-08-06 21:04:09

ఓ సినిమా తీయ‌డం కాదు.. దాన్ని విడుద‌ల చేసుకునే టైమ్ కూడా తెలిసుండాలి.. లేక‌పోతే న‌ష్టాలు త‌ప్ప‌వు. విజ‌య్ దేర‌వ‌కొండ విష‌యంలో ఇదే జ‌రుగుతుంది ఇప్పుడు. ఈయ‌న న‌టించిన రెండు సినిమాలు ఒకేసారి విడుద‌ల‌కు వ‌చ్చాయి. అందులో ఏది ముందు విడుద‌లైతే నిర్మాత‌ల‌కు మంచిది అని బేరీజు వేసుకుని.. దేన్ని ముందు తీసుకురావాలో దాన్నే విడుద‌ల చేస్తున్నారు నిర్మాతలు. పైగా ఈ రెండు సినిమాల‌కు ఒక్క‌రే నిర్మాత కావ‌డంతో ప‌ని ఇంకా సులువైపోయింది. అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఈయ‌న సినిమా అంటే ఇప్పుడు కుర్రాళ్ల‌కు బాగా పిచ్చి. అంత‌గా అర్జున్ రెడ్డి ఎక్కేసాడు వాళ్లకు. ఇప్పుడు దానికి వ‌చ్చిన మార్కెట్ ను వాడుకోవాలంటే స‌రైన సినిమా ప‌డాలి. అలా కాకుండా ఒక్క ఫ్లాప్ వ‌చ్చినా కూడా అది త‌ర్వాతి సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

అందుకే గీతాఆర్ట్స్ ఇప్పుడు మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. ట్యాక్సీవాలాను ఆపి గీత‌గోవిందంను విడుద‌ల చేస్తున్నారు. గీత‌గోవిందంపైనే అంచ‌నాలు భారీగా ఉన్నాయి. దాంతో ఈ చిత్రాన్నే ముందు తీసుకొస్తున్నారు. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది ఈ చిత్రం. ట్యాక్సీవాలాపై ఎలాంటి అంచ‌నాలు కానీ.. ఆస‌క్తి కానీ కనిపించడం లేదు. రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. టీజ‌ర్ విడుద‌ల చేసారు. జూన్ లోనే సినిమా కూడా రావాల్సింది. ఈ సినిమాను గీతాఆర్ట్స్ 2తో క‌లిసి యువీ క్రియేష‌న్స్ నిర్మించారు. ట్యాక్సీ వాలా ముందు వ‌స్తే ఖచ్చితంగా ఇద్ద‌రికి న‌ష్ట‌మే అని యువీ క్రియేష‌న్స్ ను న‌చ్చ‌చెప్పి మ‌రీ గీత‌ను ముందు విడుద‌ల చేస్తున్నాడు అల్లు అర‌వింద్. అలా చేస్తే త‌మ‌కు న‌ష్టం అని తెలిసినా కూడా ప్ర‌భాస్ ఫ్రెండ్స్ బ్యాచ్ అయిన యువీ క్రియేష‌న్స్ ఏమీ మాట్లాడ‌టం లేదు. మొత్తానికి తెలివిగా ట్యాక్సీని త‌ప్పించి గీత‌ను రోడ్డెక్కించారు. ఎంతైనా గీతాఆర్ట్స్ క‌దా.. ఆ మాత్రం తెలివితేట‌లు ఉంటాయి.

More Related Stories