English   

గీతాగోవిందం.. ఆ లిప్ లాక్స్ ఏంట‌మ్మా..?

Vijay Devarakonda Hot Lip Kisses With Rashmika in Geetha Govindam
2018-08-13 07:55:49

గీత‌గోవిందం అంటే ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని ముందు నుంచి అంచ‌నాలున్నాయి. పైగా ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ కూడా క్లీన్ సినిమాలు చేస్తుంటాడు. కానీ ఇప్పుడు గీత‌గోవిందం మాత్రం మ‌రో రేంజ్ లో ఉంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో లిప్ లాక్ సీన్స్ కామ‌న్ అయిపోయాయి. ఇదే ఇప్పుడు ఈ సినిమాలోనూ కొన‌సాగాయి. గీత‌గోవిందంలోని కొన్ని సీన్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. విడుద‌ల‌కు ముందే ఇలా సినిమా లీక్ అవ్వ‌డం మంచిది కాదు కానీ ఈ సినిమాకు మాత్రం అది హెల్ప్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే లీక్ అయిన సీన్స్ లో లిప్ లాక్ కూడా ఉంది కాబ‌ట్టి. అది కూడా హాట్ హాట్ సీన్ తో ర‌చ్చ చేసారు విజ‌య్ అండ్ ర‌ష్మిక‌. ట్రావెల్ బ‌స్ లో కూర్చుని లిప్ లాక్ సీన్ చేసారు ఈ జోడి. పైపైన కాకుండా ఇంగ్లీష్ ముద్దులోనే తేలిపోయారు ఈ జోడీ. లీక్ అయిన సీన్ లోనే ఇంత ర‌చ్చ ఉంటే.. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ఆ ర‌చ్చ ఇంకెంత ఉంటుందో..? ఏదేమైనా అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా లిప్ లాక్ సీన్స్ అంటే తెగ ఆసక్తి చూపిస్తున్నాడు.

More Related Stories