మరో రికార్డును సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ...సౌత్ లోనే మొదటి హీరో

పెళ్ళిచూపులు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మొదటి సినిమాతో నే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్ అందుకోవడమే కాకుండా...ప్రమోషన్స్ లో విజయ్ తన మాట తీరుతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ఈ సినిమా తరవాత విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాను ఒకప్పుడు టాలీవడ్ లో ట్రెండ్ సెట్ చేసిన శివ సినిమాతో పోల్చారు. ఈ సినిమాతో విజయ్ కి యూత్ లో అమితమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తరవాత విజయ్ దేవరకొండ పరుషురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా మంచి విజయం సాధించింది.
ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ల సరసన చాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం డైరెక్ట్ర్ పూరీ జగన్నాత్ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. మరోవైపు సుకుమార్ విజయ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా విజయ్ కి యూత్ లో వచ్చిన ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ సంఖ్యతో ముందుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్ కు చేరింది. దాంతో సౌంత్ నుండి 11 మిలియన్స్ ఫాలోవర్లను సంపాదించుకున్న మొదటి హీరోగా విజయ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.