English   

విజయ్ దేవర కొండ - పూరి జగన్నాథ్ లైగర్ తాజా షెడ్యూల్ ప్రారంభం.

vijay devarakonda liger movie shoot resumes
2021-09-15 22:46:13

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ డ్రామా లైగర్. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి, కరణ్‌ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ముంబాయిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఆగిన సినిమాలన్నీ సెట్స్ పైకి వచ్చాయి కానీ.. లైగర్ తిరిగి సెట్స్ పైకి రాకపోవడంతో ఎప్పుడెప్పుడు లైగర్ మళ్లీ సెట్స్ పైకి వస్తుందా అని అభిమానులు ఎదురు చూశారు.

అయితే.. ఎట్టకేలకు లైగర్ ఈరోజు సెట్స్ పైకి వచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక మెయిన్ యాక్షన్ ఎపిసోడ్ ని ఈరోజు నుంచి తీస్తున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. విజయ్ దేవరకొండ భారీ బిల్డప్ తో కనిపిస్తున్నాడు ఈ ఫైట్ లో. సినిమా కథకి కీలకమైన సన్నివేశాలు ఇవి. షూటింగ్ మొదలైందంటూ విజయ్ దేవరకొండ లొకేషన్ లో కూర్చున్న ఫోటోని షేర్ చేశారు నిర్మాత ఛార్మి. విజయ్ కూర్చున్న తీరు, అతని ఫిజిక్ చూస్తుంటే … అర్థం అవుతుంది బాక్సింగ్ ఫైట్లు ఈ రేంజులో ఉండబోతున్నాయో. వచ్చే రెండు నెలల్లో మొత్తం షూటింగ్ ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారని తెలిసింది.

విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ నెలలో ఈ సినిమాని విడుదల చేయాలి అనుకున్నారు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ముందు అనుకున్న విధంగా ఈ నెలలో రిలీజ్ చేయడం కుదరడం లేదు. తాజా సమాచారం ప్రకారం… ఈ బాక్సింగ్ డ్రామా లైగర్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ విజయం విజయ్ కి కీలకం. ఇంతకు ముందు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ అయ్యాయి దేవరకొండకి. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడని సమాచారం.

More Related Stories