English   

విజయ్.. యూ ఆర్ రాకింగ్ మ్యాన్.. 

vijay-devarakonda
2018-05-09 18:06:14

టాలీవుడ్ కో ఆర్టిస్ట్ వచ్చాడు. అతనికి బ్యాక్ గ్రౌండ్ లేదు. థియేటర్ బ్యాక్ గ్రౌండ్ తప్ప. పాత్రల్లోకి పరాయ ప్రవేశం చేయగల ప్రతిభ సొంతమైనోడు. అతనే విజయ్ దేవరకొండ. యస్.. తెలుగులో ఒకప్పుడు నాటకాలు వేసినవాళ్లు చాలామంది ఆర్టిస్టులుండేవారు. ఇప్పటికి రెండు తరాల ముందు వరకూ ఆర్టిస్ట్ ల ఫస్ట్ క్వాలిఫికేషన్ నాటకానుభవమే. కానీ మన దగ్గర థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు తక్కువ. ఇప్పుడు విజయ్ వచ్చాడు. విజయ్ దేవరకొండ. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి వెళ్లిపోతున్నాడు. పెళ్లి చూపులులో సొంతం గా నిలదొక్కుకునే యువకుడిగా అద్భుతమైన నటన చూపించాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డిలో ఏకంగా ఆ పాత్రను ఆవాహన చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇది కేవలం అతని ప్రతిభకు మాత్రమే దక్కిన గౌరవం. ఇక కొన్ని వేదికలపై విజయ్ యాటిట్యూడ్ చూసిన చాలామంది కుర్రాడు ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ నుంచి బయటకు రాలేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు మహానటిలో అతన్ని చూస్తే తెలుస్తుంది. అతని యాటిట్యూడ్ ఏదైనా యాక్టింగ్ టాలెంట్ వేరని. 

మహానటిలో విజయ్ ఆంటోనీగా అతని నటన మెస్మరైజ్ చేస్తుంది. నిన్నటి అర్జున్ రెడ్డి ఫ్లేవర్ ఏ మాత్రం కనిపించలేదీ విజయ్ ఆంటోనీలో. అది నటుడికి ఉండే సత్తా. ఒక్కో సినిమా నటుడుగా అతన్ని ఒక్కో మెట్టు ఎక్కిస్తున్నాయి అనుకుంటారు చాలామంది. కానీ అతను నటుడు. తన నటనతోనే ఆయా సినిమాల్లోని పాత్రలను మరో మెట్టు పైన చూపిస్తున్నాడు. ఇది నిజం. మొత్తంగా చాలాకాలం తర్వాత తెలుగులో బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఓ నటుడు వచ్చాడు. అతను విజయ్ దేవరకొండ. ఇంకాస్త మంచి సినిమాలు పడితే ఖచ్చితంగా టాలీవుడ్ లో నెక్ట్స్ లెవెల్ కు వెళ్లగల ప్రతిభ అతనిలో పుష్కలం. లేటెస్ట్ గా తనకంటూ ఓ కొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు విజయ్. వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. అతని కోసం చాలామంది దర్శక నిర్మాతలు వేచి చూస్తున్నారిప్పుడు. ప్రస్తుతం టాక్సీవాలా, నోటా, డియర్ కామ్రేడ్ అనే సినిమాలతో మస్త్ బిజీగా ఉన్నాడు విజయ్. చూస్తుంటే ఇవన్నీ విజయం సాధించేలానే ఉన్నాయి. మరి అదే నిజమైతే ఖచ్చితంగా విజయ్ టాలీవుడ్ కో బెస్ట్ హోప్ అవుతాడు.. అది నిజం.  

More Related Stories