English   

ఠాట్.. విజయ్ దేవరకొండే టాలీవుడ్ నెంబర్ వన్..?

Vijay-Devarakonda
2018-03-13 13:16:12

మీరు చదివింది కరెక్టే. విజయ్ దేవరకొండే టాలీవుడ్ లో ది బెస్ట్ హీరో. ఈ మాట మనం అనడం లేదు. హైదరాబాద్ టైమ్స్ పత్రిక ద్వారా చేపట్టిన ఆన్ లైన్ పోల్ లో ఆ ఘనత సాధించాడు విజయ్. మోస్ట్ డిజైరబుల్ మేన్ ఆఫ్ 2017 సర్వేలో విజయ్ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ పక్కనబెట్టాడు. అయితే అతనే ఫస్ట్ కాదు. టివిషోస్ లో పార్టిసిపేట్ చేసే బసీర్ అలీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. విజయ్ దేవరకొండ సెకండ్ ప్లేస్. యస్ 2017 మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వేలో విజయ్ దేవరకొండ సెకండ్ ప్లేస్ లోనిలిచాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, ఎన్టీఆర్ వంటి స్టార్స్ ను కూడా పక్కకు నెట్టి విజయ్ ఈ ఘనత సాధించాడు. ఇందుకు కారణం ఏంటో ఎవరైనా ఈజీగా గెస్ చేయొచ్చు.

లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్అయిపోయాడు. పెళ్లి చూపులు హిట్ మాత్రమే ఇచ్చింది. అర్జున్ రెడ్డి ఇమేజ్ కూడా తెచ్చింది. రాత్రికిరాత్రే అతనికి అభిమానులు పుట్టుకొచ్చారు. విజయ్ నటనకు బిగ్గెస్ట్ స్టార్స్ సైతం ఫిదా అయిపోయారు. అప్పట్లో శివ తర్వాత ఆ రేంజ్ సినిమా గేమ్ చేంజింగ్ మూవీ అంటే  అర్జున్ రెడ్డే అన్నారంతా. అందుకు ప్రధాన కారణం దర్శకుడు, స్క్రిప్ట్ అయినా.. కేవలం మూడు సినిమాల వయసుకే అంత పెద్ద సబ్జెక్ట్ లో లీనమైపోయిన విజయ్ దేవరకొండ క్రెడిట్ ఏమాత్రం తక్కువ కానిది. అదే విజయ్ కి టాలీవుడ్ లో ది బెస్ట్ ప్లేస్ ఇచ్చేసింది. ఏదేమైనా ఈ మోస్ట్ డిజైరబుల్ మేన్ కు కంగ్రాట్యులేషన్స్ చెప్పేద్దాం.. 

More Related Stories