English   

 ఇంకేం కావాలి.. ఇంత బావుంటే.. !!

geethagovindam
2018-07-10 13:38:20

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీకి పరశురాం డైరెక్టర్. రీసెంట్ గా ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఈ టీమ్ లేటెస్ట్ గా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. కంప్లీట్ మెలోడీగా సాగే ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. చాల్లే చాల్లే ఇది చాల్లే అంటూ అనంత శ్రీరామ్ రాసిన ఈ లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. సింగర్ టోన్ కూడా కొత్తగా వినిపిస్తోంది.

అతని పేరు సిద్ధ్ శ్రీరామ్ అట. అతని టోన్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అలాగే పాట మొదట్లోనే వచ్చే చిన్న డ్యూయొట్ బిట్ నేరుగా మనల్ని పాటలోకే తీసుకువెళుతోంది. ఇక ఈ మధ్య సరైన ఆల్బమ్ ఇవ్వడంలో అంచనాలు మిస్ అవుతోన్న గోపీ సుందర్ ఈ సారి నిరాశపరిచేలా లేడు.. నిజానికి ఇలాంటి ప్రేమకథలకు సంగీతం హైలెట్ అయితే ఖచ్చితంగా సినిమాకు డబుల్ ప్లస్ అువుతంది. ఆ రకంగా ఈ సారి ఈ మళయాలీ సంగీత దర్శకుడు ప్లస్ అయ్యేలానే ఉన్నాడు. మొత్తంగా ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ కోసం చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ ను ఈ మెలోడీ మరింత పెంచిందనే చెప్పాలి.  

More Related Stories