English   

అప్పుడే బ్రేకప్ చెప్పేస్తున్న విజయ్ ?

 Vijay Devarakonda
2019-05-22 12:21:36

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత నుండి తన స్టార్ డం ని పెంచుకునే పనులే చేస్తూ పోతున్నాడు. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా డియర్ కామ్రేడ్ రిలీజ్ కి రెడీగా ఉంది. రాష్మికా మందన్నా నటించిన ఈ సినిమాని భరత్ కమ్మ అనే నూతన దర్శకుడు తెరకేక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు విజయ్ ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాని వల్లభ నిర్మిస్తున్నారు. ఇక విజయ్ సరనస రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి, కేథ‌రిన్ థెస్రా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి బ్రేక‌ప్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఈ మధ్యనే ఈ సినిమా షూట్ సింగరేణి కాలరీస్ లో జరిగింది. అయితే ఇందులో విజయ్ పాత్ర ఏమిటనేది క్లారిటీ లేకపోయినా ఈ టైటిల్ ని బట్టి ఇదేదో బ్రేకప్ లవ్ స్టోరీ అని అంటున్నారు. తన జీవితంలో తాను కలుసుకున్న అందరు అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ బాదితుడిగా విజ‌య్ మిగిలిపోతాడని, అందుకే ఈ సినిమాకు బ్రేకప్ అనే టైటిల్ బాగుంటుంద‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట‌. చూడాలి మరి ఈ సినిమా విజయ్ కి ఇంకెంత పెద్ద విజయం అందించనుందో ?

More Related Stories