English   

హీరో అంటూ మొదలెట్టిన విజయ్

vijay
2019-05-19 16:23:34

వరుస సినిమాలతో సందడి చేస్తున్న సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ మరో సినిమాను లైన్లో పెట్టేసారు. తాజాగా విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా కాంత్రికుమార్ దర్శకత్వంలో మరో సినిమా  సెట్స్‌ మీద ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా మొదలు పెట్టేశాడు దేవరకొండ. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో డియర్ కామ్రేడ్ అనే సినిమాని నాలుగు బాషలలో రిలీజ్ చేస్తుండగా ఈరోజు ప్రారంభం అయిన సినిమా కూడా బహు బాషా చిత్రంగానే తెరకెక్కనుంది. తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ ను కూడా ఫిక్స్ చేసేశారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ బైక్‌ రేసర్‌ గా కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాతో విజయ్ సరసన మలయాళ నటి మాళవిక మోహనన్‌ నటిస్తున్నారు ఆమె ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. చూడాలి రౌడీ బాబు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో ఏమో ?

More Related Stories