English   

విజయ్ దేవరకొండతో మరో తమిళ కుర్రాడు

Vijay-Devarakonda
2018-03-30 17:32:36

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ అనే పేరే ఓ సెన్షేషన్ అయింది. అతనికి అర్జున్ రెడ్డి సర్వనామంగా మారింది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ కుర్రాడి డేట్స్ కోసం చాలామంది నిర్మాతలు బ్లాంక్ చెక్స్ పట్టుకుని ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అతనికెంత రేంజ్ ఉందో. అందుకే విజయ్ దేవరకొండ అనే పేరు వినిపిస్తే చాలు.. యూత్ ఒక్కసారిగా అటెన్షన్ అయిపోతున్నారు. ప్రస్తుతం టాక్సీవాలాతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోన్న ఈ లేటెస్ట్ సెన్షేషనల్ స్టార్ తమిళంలోనూ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించే అంశమైతే ఏకంగా ఇది పొలిటికల్ థ్రిల్లర్ కావడం విశేషం. ఆ సినిమా పేరు నోటా. ఆ విషయం పక్కనబెడితే ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాతో ఓ తమిళ సంగీత దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. 

విజయ్ నటిస్తోన్న సినిమాల్లో ఇప్పుడు భరత్ కమ్మ అనే దర్శకుడి సినమా ఒకటి. ఈ సినిమాతోనే ఆ తమిళ సంగీత దర్శకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. పేరు జస్టిన్ ప్రభాకర్. ఇతను తమిళంలో ‘ఒరునాల్ కూతు’, ‘తోండన్’ అనే హిట్ సినిమాలు చేశాడు. భరత్ కమ్మ చేసిన ఓ షార్ట్ ఫిలిమ్ కు అతను సంగీతం అందించాడు. ఆ పరిచయంతోనే ఇప్పుడు తెలుగులో సినిమాకూ సంగీతం అందిస్తూ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం తమిళంలో చాలా బిజీగా ఉన్నాడీ కుర్రాడు. నానోడిగళ్-2తో పాటు ఎస్.జే. సూర్య సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఛలో బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. 

More Related Stories