English   

రామ్ గోపాల్ వర్మ ఎంత లోకువయ్యాడు..?

vijay-Devarakonda
2018-03-12 14:49:54

ఎంత పెద్ద తోడు దర్శకుడైనా హిట్లుంటేనే లెక్క. లేదంటే ఎవరూ లెక్క చేయరు. ఎందరు వందిమాగధులు పొగడ్తలు కురిపించినా.. ‘నిన్నటి ప్రతిభ’ నేడు లెక్కలోకి తీసుకోని ఇండస్ట్రీ ఇది. ఏదో ఒక షాట్ బావున్నంత మాత్రాన ఆ దర్శకుడు ప్రతిసారీ తోపైపోడు. ఒకప్పటి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఇది బాగా సూట్ అవుతుంది. విజయాలకు దూరంగా వివాదాలకు అతి దగ్గరగా ఉండటం మొదలైన తర్వాత రామూకు విజయం మొహం చాటేసింది. దశాబ్ధానికి పైగా వరుస ఫ్లాపులతో ఆడియన్స్ ను బెంబేలెత్తిస్తోన్న రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం నాగార్జునతో ఆఫీసర్ అనే సినిమా తీస్తున్నాడు. మే 25న ఈ మూవీ విడుదల కాబోతోంది. అయితే వర్మలో ఎవరికీ తెలియని మరో కోణం బిస్కెట్స్ వేయడం. ఆ మధ్య ఓ యంగ్ స్టార్ పై వరుసగా బిస్కెట్ పాకెట్సే వేశాడు. కానీ కుర్రాడు చాలా షార్ప్ ఉన్నాడు. అందుకే వర్మ బిస్కెట్స్ కు పడిపోలేదు. అంతే కాదు.. అతను డేట్స్ అడిగితే కూడా నో చెప్పాడు. ఆ నో చెప్పడం కూడా వర్మకు షాక్ ఇచ్చేలా..

అర్జున్ రెడ్డి తర్వాత ఆ హీరో విజయ్ దేవరకొండపై వర్మ ఎంత ప్రేమ చూపించాడో అందరికీ తెలుసు. ఏకంగా తన ముంబై ఆఫీస్ కూ పిలిపించుకున్నాడు. విజయ్ కూడా వర్మ ‘కంపెనీ’కి చాలాసార్లు వెళ్లాడు. ఏదో సీనియర్ డైరెక్టర్ కదాని విజయ్ వెళ్లి ఉంటాడు. కానీ అప్పుడే వర్మ.. విజయ్ ని బాలీవుడ్ కు పరిచయం చేస్తా అన్నాడు. బట్ విజయ్ నో చెప్పాడు. ఇప్పటికే చాలా సినిమాలు ఒప్పుకున్నానని.. సో ఇప్పుడు బాలీవుడ్ కు రావడం కుదరదని తేల్చి చెప్పాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా వర్మ మళ్లీ విజయ్ ని డేట్స్ అడిగాడని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సారి తెలుగులోనే సినిమా చేస్తా అన్నాడంటున్నారు. కానీ ముందు ఓ రెండు హిట్స్ ఇవ్వడం అప్పుడు డేట్స్ ఇస్తా అని విజయ్ ఖచ్చితంగా తేల్చేశాడట. ఈ ఆన్సర్ ఎక్స్ పెక్ట్ చేయని వర్మ కంపెనీ.. ఖంగు తింది. నిన్నటి వరకూ ట్విట్టర్ లో ప్రేమలు కురిపించినవన్నీ అప్పుడే మర్చిపోయాడా అంటూ అతని చుట్టూ ఉన్న జనం గుసగుసలు పోతున్నారు. కానీ డేట్స్ ఇవ్వాలంటే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో కోల్పోయాడు. ఈ విషయం తెలియని జనరేషన్ కాదిది. ఏదేమైనా వర్మ మరీ ఎంత లోకువయ్యాడో కదా.. కానీ ఇదంతా స్వయంకృతాపరాథం అనేది అందరికీ తెలుసు.. అతనితో సహా. 

More Related Stories