English   

అర్జున్ రెడ్డి  అప్పుడే త‌మిళ్ అంటున్నాడు

Vijay-Devarakonda

పెళ్లిచూపులుతో ఫేమ్ అయ్యి అర్జున్ రెడ్డితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన కుర్రాడు విజయ్ దేవ‌ర‌కొండ‌. అర్జున్ రెడ్డి అత‌ని స‌ర్వ‌నామం అయిపోయింది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న అర్జున్ రెడ్డి.. సారీ విజ‌య్ ఏకంగా త‌మిళ్ మార్కెట్ లోకీ ఎంట‌ర్ కాబోతున్నాడు. రెగ్యుల‌ర్ గా సూర్య‌తోనే సినిమాలు నిర్మించే స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ అధినేత జ్నాన‌వేల్ రాజా.. ఫ‌స్ట్ టైమ్ ఓ తెలుగు హీరోతో సినిమా చేయ‌బోతున్నారు. నిజానికి అత‌ను గ‌తంలోనే అల్లు అర్జున్ తో సినిమా చేయాల‌నుకున్నాడు. లింగుస్వామి దీనికి ద‌ర్శ‌కుడు. ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకున్న ఈ ప్రాజెక్ట్ వ‌ర్క‌వుట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో తెలుగు మార్కెట్లోకి ఎంట‌ర్ అవుతున్నాడు రాజా. 

ఇవాళ రామానాయుడ స్టూడియోలో ఓపెనింగ్ జ‌రుపుకున్న ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విడుద‌ల‌వుతుంది. ఆనంద్ శంక‌ర్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. లేటెస్ట్ బ‌బ్లీ బ్యూటీ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్ గా న‌టిస్తోంది. మొత్తంగా కెరీర్ ఆరంభంలోనే ఇలా త‌మిళ్ లో ప్రామిసింగ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ తో టై అప్ అవుతుండ‌టం విజ‌య్ కెరీర్ కు ప్ల‌స్ పాయింట్. అలాగే ఇది విజ‌య్ కు ఫ‌స్ట్ స్ట్రెయిట్ త‌మిళ్ మూవీ కూడా అవుతుంది. 

ఇప్ప‌టికే అర్జున్ రెడ్డితో అక్క‌డి స్టార్ హీరోల‌ను కూడా ఇంప్రెస్ చేశాడు విజ‌య్. అది ఈ మూవీతో అక్కడ ఎంట్రీ ఇవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఏదేమైనా అర్జున్ రెడ్డి త‌ర్వాత ఇప్ప‌టికే చేతినిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విజ‌య్.. త‌మిళ్ మార్కెట్లోకీ ఎంట‌ర్ అవుతుండ‌టం ఆశ్చ‌ర్య‌మే. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడితే అత‌నికి అక్క‌డా మార్కెట్ ఏర్ప‌డుతుంది. దీంతో అక్క‌డి హీరోల్లా అత‌నూ త‌న‌సినిమాలు డ‌బ్ చేసేయొచ్చు.

More Related Stories