English   

విజయ్, సమంతల పాట అదిరిపోయిందంతే

Vijay-Devarakonda-samantha
2018-04-27 11:13:23

మహానటి నుంచి మరో పాట విడుదలైంది. మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇవాళ సదా నిన్ను అనే పాట రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ మూవీలో టైటిల పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. రీసెంట్ గా మూగమనసులు అంటూ సాగే పాటను కీర్తి సురేష్, దుల్కర్ సాల్మన్ ల పాత్రల మధ్య వస్తుందని చూపించారు. అయితే ఈ సారి ఆశ్చర్యంగా సమంత, విజయ్ ల మధ్య వచ్చే పాటగా ఈ సదా నిన్నే అనే పాట వచ్చింది. నిజానికి ఈ సినిమాల విజయ్, సమంతల పాత్రలు ఏంటీ అనే క్లారిటీ చాలామందిలో లేదు. ఇంకా చెబితే ఈ ఇద్దరి పాత్రలే సినిమాలో హైలెట్ అవుతాయని చెప్పేవారూ ఉన్నారు. మహానటిలో ఈ ఇద్దరూ క్రౌడ్ పుల్లర్ అని కూడా అంటున్నారు. 

కాలం నర్తించదా నీతో జతై అంటూ చాలా రోజుల తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం కదం తొక్కింది. చారులత మణి అనే గాయని పాడిన ఈ పాట చాలా ప్యూర్ గా వినిపిస్తోంది. ఇక పాటలో కనిపించిన మేకింగ్ విజువల్స్  చూస్తే నిజంగానే ప్రేక్షకులను ఆకాలానికి తీసుకువెళ్లబోతున్నారనే విషయం అర్థమౌతోంది. వాహిని స్టూడియో నుంచి తిరునాల్ల సెటప్ వరకూ అంతా అదిరిపోయింది. ఇక లిరికల్ సాంగ్ చూస్తేనే విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో పండింది అనే విషయం అర్థమౌతంది. మొత్తంగా మే 1న ఆడియో మే 9న సినిమా విడుదల కాబోతోంది. 

More Related Stories