English   

షూటింగ్ గ్యాప్ లో ఆ పని చేసిన ఛార్మీ విజయ్...ట్వీట్ వైరల్

Vijay Devarakonda
2021-02-20 13:28:18

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్..పూరి కనెక్ట్స్ బ్యానర్లపై ఛార్మి, కరణ్ జోహార్, పూరి, అపూర్వ మెహతా లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై లో జరుగుతోంది. 

అయితే షూటింగ్ గ్యాప్ లో విజయ్..ఛార్మి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ గ్యాప్ లో ఛార్మి విజయ్ ని స్కూటీ పై కూచోబెట్టుకుని సరదాగా రైడ్ కు వెళ్ళింది. ఈ సందర్భంగా వాళ్ళు తీసుకున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విజయ్ తనపై ఎంతో నమ్మకం తో బైక్ పై వెనకాల కూర్చున్నాడని పేర్కొంది. ఇక ఈ సినిమాను తెలుగు తో పాటు..కన్నడ, హిందీ.మలయాళ, తమిళ, భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. క్రేజీ డైరెక్టర్ పూరి..క్రేజీ హీరో విజయ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచలనాలు ఉన్నాయి.

More Related Stories