English   

విజయ్ దేవరకొండ పోటీకి ఎదురెళుతున్నాడు 

Vijay-Devarakonda
2018-05-22 15:00:08

టాలీవుడ్ న్యూ సెన్షేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అయితే అతను ఫిక్స్ చేసుకున్న డేట్ లో విపరీతమైన పోటీ ఉండటం ఆశ్చర్యం. ఇప్పటికే ఈ నెల 18న విడుదల కావాల్సిన టాక్సీవాలా.. డేట్ మార్చుకుంది. అందుకు కారణం మహానటి కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉండటం.. రంగస్థలం వల్ల థియేటర్స్ ఖాళీ లేకపోవడం.. అటు భరత్ కూడా బాగానే రన్ అవుతుండటంతో ఈ డేట్ కరెక్ట్ కాదనుకున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా పూర్తి కాలేదని చెప్పారు. అవన్నీ ఎలా ఉన్నా ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న డేట్ లో భారీ కాంపిటీషన్ ఉండటంతో అతను పోటీకి ఎదురెళుతున్నాడా అనిపించక మానదు. 

టాక్సీవాలా జూన్ 14న విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఆ టీమ్ నుంచి వినిపిస్తోన్న మాట. అయితే అదే రోజు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం ఉంది. ఇంద్రగంటి మోహన కృష్ణ సమ్మోహనంతో పాటు రాజ్ తరుణ్ లవర్ కూడా ఉంది. ఈ మూడు సినిమాలకు ఇప్పుడు టాక్సీవాలా తోడయ్యాడు. ఒక రకంగా చూస్తే ఈ ముగ్గురికంటే టాక్సీవాలాకే క్రేజ్ ఉంటుంది. కానీ ఆల్రెడీ వాళ్లు థియేటర్స్ కూడా సెట్ చేసుకున్నారు. ఇటు టాక్సీవాలాకు అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ బ్యాకప్ ఉన్నా.. ఎక్కువ థియేటర్స్ అయితే క్రియేట్ చేయలేరు కదా.. మరోవైపు జూన్ 7న సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా ఉంది. అది ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా జూన్ 14న థియేటర్స్ దొరకడం కష్టం. సో.. ఎలా చూసినా టాక్సీవాలాకు జూన్ 14అనేది రైట్ డేట్ కాదు. ఒకవేళ ఆ రోజు వస్తోన్న సినిమాల్లో ఏవైనా పోస్ట్ అయితే తప్ప.. అది నిజంగానే టాక్సీవాలాకు కరెక్ట్ టైమ్ కాదు. 

More Related Stories