English   

 టాక్సీవాలా కూడా వచ్చేస్తున్నాడు.. 

Vijay-Devarakonda
2018-04-15 18:02:17

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ టాక్సీవాలా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ మూవీ టీజర్ ఈనెల 17న విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ గేర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ తో పూర్తిగా ఇంప్రెస్ చేయబోతోంది టీమ్. ఈ విషయంపై విజయ్ దేవరకొండ కూడా ట్వీట్ చేశాడు. ఇంత వరకూ మీరు చూడనటువంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్ తో వస్తున్నాం రెడీగా ఉండండి అంటూ సినిమా కథపై ఓ హింట్ కూడా ఇచ్చేశాడు. దీంతో అతను మరో సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనుకుంటున్నారు అభిమానులు. తక్కువ టైమ్ లో పెద్ద స్టార్ గా మారిన విజయ్ కు టాక్సీవాలా విజయం కీలకం. అందుకు తగ్గట్టుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. పైగా యూవీ క్రియేషన్స్ కథకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి.. మాగ్జిమం బావుండొచ్చు అనుకోవచ్చు. ఇక విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారీ మూవీలో. మాళవిక నాయర్, ప్రియాంక ఝాల్కర్. వీరిలో ఒక పాత్ర మాస్ బాగా మరో పాత్ర క్లాస్ గా ఉంటుందని టాక్. మొత్తంగా ఈ నెల 17న వచ్చే టాక్సీవాలా టీజర్ తో విజయ్ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. 

More Related Stories