English   

విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్ దెయ్యమా..?

Vijay- Devarakonda
2018-03-23 13:46:29

అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ ఈ సారి మరింత భిన్నంగా కనిపించబోతున్నట్టు టాక్. ప్రస్తుతం రాహుల్ సాంక్రుత్యాయన్ దర్శకత్వంలో టాక్సీవాలా అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ మూవీ మే 18న విడుదల కాబోతోంది. మైత్రీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. అయితే టాక్సీవాలా అనగానే చాలామంది మాస్ మసాలా మూవీ అనుకున్నారు. కానీ ఇదో హారర్ మూవీ అని తెలుస్తోంది. యస్.. టాక్సీవాలా హారర్ మూవీయేనట. ఈ దర్శకుడు గతంలో తీసిన సినిమా కూడా హారర్ జానరే. ఆ సినిమా పేరు ది ఎండ్. రెండో సినిమా కూడా అదే జానర్ ను ఎంచుకోవడం.. ఈ సినిమాను మైత్రీ మూవీస్ వంటి బ్యానర్ ప్రొడ్యూస్ చేయడం.. ఇప్పటికే చేసిన సినిమాలతో డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ కథకు ఓకే చెప్పడం అన్నీ చిత్రంగానే ఉన్నాయనుకోవచ్చు. 

విజయ్ దేవరకొండ నడిపే టాక్సీలో అతనితో పాటు ఓ అమ్మాయి ఆత్మ కూడా ఉంటుందట. ఈ విషయం అతనికీ తెలుసు. అయినా భయపడకుండా ఆ దెయ్యంతో దోస్తీ చేస్తుంటాడు. అసలు ఆ దెయ్యం ఎవరు..? ఈ కార్ కూ ఆ దెయ్యానికి సంబంధం ఏంటీ అనేది అసలు కథ. అయితే ఈ దెయ్యమే హీరోయిన్ అనేవారూ ఉన్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ టీమ్ ముందుగా ఈ సినిమాకు ‘షికారు’ అనే టైటిల్ పెట్టాలనుకుంది. షి అండ్ కారు కలిసి కథను జస్టిఫై చేస్తాయి కదా.. కానీ మరీ క్లాస్ గా ఉందని.. టాక్సీవాలాకు ఫిక్స్ అయ్యారు. మొత్తంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ హారర్ జానర్ లో కనిపించబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు ఇతర వివరాలూ తెలియజేయబోతోంది టీమ్. 

More Related Stories