English   

 విజయ్ ఫస్ట్ గేర్ లో విషయం ఎంత..?

Vijay-Devarakonda

టాక్సీవాలా ఫస్ట్ గేర్ వేశాడు. ఒక్కసారిగా దూసుకుపోయాడు. కానీ డ్రైవింగ్ చేస్తోన్న కార్లు మాత్రం తేడాగా ఉన్నాయి. మొదట్లో ఓ పాత మోడల్ వైట్ కార్ తో బయలు దేరిన విజయ్ ఆ తర్వాత ఫైనల్ గా అది బ్లాక్ కలర్ లోకి మారింది. ఇందుకు కారణమేంటో కానీ దీన్ని టీజర్ అనలేం. ఆ విషయం వారికీ తెలుసు. అందుకే ఏ పేరూ పెట్టకుండా ఫస్ట్ గేర్ అనేశారు. ఇదేదో బావుంది కానీ.. దీని ద్వారా వాళ్లు ఏం చెప్పాలనుకున్నారు అన్న విషయం మాత్రం క్లియర్ గా కన్వే కాలేదు. కాకపోతే వైట్ అండ్ బ్లాక్ కలర్ కార్లను బట్టి ఈ రెండు కార్లకు సినిమాలో ఇంపార్టెన్స్ చాలా ఉందనే విషయం తెలుస్తోంది.  గతంలో ది ఎండ్ అనే హారర్ మూవీ తీసిన రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. మే 18న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించి విజయ్ టాక్సీవాలా అనే విషయం తప్ప వేరేదీ తెలియలేదు. రీసెంట్ ఈ మూవీలో హీరోయిన్ దెయ్యం అనే వార్త హల్ చల్ చేస్తోంది. ఆ బ్లాక్ అండ్ వైట్ కార్స్ ఈ విషయాన్నేమైనా కన్వే చేస్తాయో లేదో తెలియదు కానీ.. ఈ ఫస్ట్ గేర్ కే బండి పికప్ తెలియదు కదా.. అందుకే ఇదేమంత కిక్ ఇవ్వలేదనే చెప్పాలి.

More Related Stories