English   

 ఏం మాట్లాడుతున్నవ్ రా మాదాపూర్...? ఉండవిక.. 

Vijay-Devarakonda
2018-05-02 12:52:13

విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందనే టాకూ వచ్చింది. దీంతో విజయ్ సినిమాలంటే కేవలం అడల్ట్స్ కే పరిమితా అనే డౌట్ కూడా చాలామందిలో ఉంది.ఈ డౌట్ క్లియర్ చేయడానికే లేటెస్ట్ గా టాక్సీవాలా టీమ్ ఓ కొత్త కల కన్నది. యస్.. కలే. దానికి ‘ద డ్రీమ్ బిహైండ్ టాక్సీవాలా’అని పేరు కూడా పెట్టారు. ఈ పేరుతో ఇవాళ ఓ వీడియో కూడా విడుదల చేశారు. నలుగురు చిన్న పిల్లు వచ్చి.. అతని అర్జున్ రెడ్డి మిస్ అయ్యామని.. ఇకపై వచ్చే నీ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చూస్తాం అని చెబుతారు. అందుకోసం అతని అర్జున్ రెడ్డి హ్యాబిట్స్ ను ఒక్కొక్కటిగా డిస్ట్రాయ్ చేస్తూ వెళతారు. కట్ చేస్తే వారంతా కలిసి విజయ్ ని మంచి బాలుణ్ని చేస్తారు.
 
అలా మారిన మంచి బాలుడు విజయ్.. కుర్రాళ్లందర్నీ తీసుకుని టాక్సీలో బయలు దేరతాడు. ఆ ఫీలింగ్ అతనికి  కూడా చాలా బావుంటుంది. అది ఓ ‘మాంచి స్మైల్’తోనే తెలియజేస్తాడు. ఇక కుర్రాళ్లందరినీ ఓ చోట దింపేసి.. అందరం థియేటర్స్ లో కలుద్దాం అంటాడు. అన్నట్టు మధ్యలో ఈ సినిమాకు యూ/ఏ వస్తుందేమోరా అంటాడు. దానికి పిల్లకాయలు ఏ ఫర్వాలేదులే అన్నా.. మేం మా పేరెంట్స్ ను మానేజ్ చేసుకుంటాం అంటారు. అదీ మేటర్..  అర్జున్ రెడ్డితో వచ్చిన అడల్ట్ ఇమేజ్ ను పోగొట్టుకుని.. ఏ అబ్బే.. టాక్సీవాలాలో అలాంటి బూతులు, లిప్ లాకులు గట్రా ఏమీ ఉండవని అందరికీ తెలియజేసేందుకే ఇలా ద డ్రీమ్ బిహైండ్ టాక్సీవాలా అనే వీడియో వదిలారన్నమాట. ఇక యూవీ క్రియేషన్స్ బ్యానర్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఇతను గతంలో ది ఎండ్ అనే హారర్ మూవీ తీశాడు. అయితే ఈ డ్రీమ్ బిహైండ్ టాక్సీవాలాకు మాత్రం కోదండరామ్ సోంపల్లి అనే అతను దర్శకుడు కావడం విశేషం. ప్రియాంక ఝాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తోన్న టాక్సీవాలా.. ఈ నెల 18న విడుదల కాబోతోంది. 

More Related Stories