English   

విజ‌య్ ను హ్యాండిల్ చేస్తారా క్రాంతిమాధ‌వ్ గారు..? 

Vijay-Devarakonda
2018-08-16 19:02:01

నిన్న‌టి వ‌ర‌కు కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే క్రేజీ హీరో.. కానీ గీత‌గోవిందం విడుద‌లైన త‌ర్వాత మ‌నోడి రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఈయ‌న్ని స్టార్ హీరో అన్నా త‌క్కువేం కాదు.. త‌ప్పు అస‌లే లేదు. ఎందుకంటే ఈ సినిమాకు వ‌స్తోన్న ఓపెనింగ్స్ అలా ఉన్నాయి మ‌రి. తొలిరోజు అక్ష‌రాలా 9 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది ఈ చిత్రం. అందులో 4 ల‌క్ష‌ల డాల‌ర్లు కేవ‌లం యుఎస్ ప్రీమియ‌ర్స్ రూపంలో వ‌చ్చాయి అంటే విజ‌య్ రేంజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఈయ‌న త్వ‌ర‌లోనే క్రాంతిమాధ‌వ్ తో సినిమా చేయ‌బోతున్నాడు. మ‌ళ్లీమ‌ళ్లీ ఇది రానిరోజు లాంటి సినిమాతో ఈయ‌న గుర్తింపు తెచ్చుకున్నాడు.

గ‌తేడాది ఈయ‌న తెర‌కెక్కించిన ఉంగ‌రాల రాంబాబు డిజాస్ట‌ర్ అయినా కూడా ఆ ప్ర‌భావం ప‌డ‌కుండా ఇప్పుడు విజ‌య్ కోసం క‌థ సిద్ధం చేసాడు క్రాంతి. ఇదిలా ఉంటే ఇప్పుడు విజ‌య్ ఉన్న పొజిష‌న్ ప్ల‌స్ క్రేజ్ ను క్రాంతి ఎంత‌వ‌ర‌కు హ్యాండిల్ చేస్తాడు అనేది అంద‌ర్లోనూ ఉన్న అనుమానం. అయితే ఇక్క‌డ మ‌రో అడ్వాంటేజ్ కూడా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ద‌ర్శ‌కుల‌ను రెస్పెక్ట్ చేయ‌డం బాగా తెలుసు. క‌థ డిమాండ్ చేస్తే కాళ్లు ప‌ట్టుకోడానికి కూడా సిద్ధంగానే ఉంటాడు ఈ హీరో. గీత‌గోవిందంలో కూడా ఇదే చేస్తాడు విజ‌య్. హీరో వ‌ర్షిప్ కంటే కూడా న‌టుడిగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తాడు విజ‌య్. అందుకే ఇప్పుడు భ‌ర‌త్ క‌మ్మ‌తో డియ‌ర్ కామ్రేడ్.. రాహుల్ సంక్రీత్య‌న్ తో ట్యాక్సీవాలా సినిమాలు చేస్తున్నాడు విజ‌య్. అలాగే క్రాంతి కూడా మంచి క‌థ తీసుకొస్తే ఏమ‌న‌కుండా చేస్తాడేమో..? 

More Related Stories