English   

విజయ్ తమ్ముడి సినిమా రిలీజ్ డేట్ అదే ?

Dorasani
2019-05-22 18:00:49

సినిమాల్లో వారసత్వం అనేది చాలా కామన్, ఈరోజు తెలుగు పరిస్థితే చూస్తే స్టార్స్ లిస్ట్ లో ఉన్న చాలా మనది ఒకప్పటి స్టార్స్ కి వారసులే. ఇక ప్రస్తుతానికి సెన్సేషనల్ స్టార్ గా టాలీవుడ్ లో వెలుగొందుతున్న యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ అప్పుడే తన తమ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండని కూడా రంగంలోకి దించేస్తున్నాడు. ఆయన హీరోగా రాజశేఖర్ జీవితాల చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం చాల మందికి తెలీదు, అంత సైలెంట్ గా షూట్ కూడా అవగోట్టారు. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుందట. తెలంగాణ గడీల నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఆర్ మ‌హేంద్ర అనే నూతన దర్శకుడు తెర‌కెక్కిస్తున్నారు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని సురేష్‌ బాబు సమర్పణలోనే పెళ్లి చూపులు కో ప్రొడ్యూసర్ విజయ్-ఆనంద్ లకి మేనమామ అయిన యష్ రంగినేని - మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నిర్మించిన ఏబీసీడీ సినిమా ఈ నెలలో రిలీజ్ అయి హిట్ టాక్ అందుకుంది, ఇక వచ్చే నెలలో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా తమ్ముడిని విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కూతురిని రాజ‌శేఖ‌ర్ ప్రమోట్ చేసుకోడానికి దొర‌సాని మూవీ ప్ర‌మోష‌న్‌స్లో భాగం అవుతార‌ని సమాచారం. అయితే ఈ సినిమాని సురేష్ బాబు అందుకున్నదంటే ఈ సినిమాలో విషయం ఉన్నట్టే ? మరి ఈ సినిమా ఏమి చేస్తుందో చూడాలి మరి.

More Related Stories