English   

విజయ్ కోసం బన్నీ వస్తున్నాడు

Vijay Devarakonda Allu Arjun Geetha Govindam Audio Launch
2018-07-26 18:20:41

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన సినిమా గీత గోవిందం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాకు పరశురాం దర్శకుడు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్ కు, లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ పాడిన పాట డిజిటిల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 29న గీత గోవిందం ఆడియో విడుదల కాబోతోంది. ఈ ఆడియో వేడుకకు చీఫ్ గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తుండటం విశేషం. యస్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా గీత గోవిందం పాటల పండగ జరగబోతోంది. అల్లు అర్జున్ ఎంట్రీతో ఈ మూవీ రేంజ్ మారుతుందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. 

యూత్ ఫుల్ సబ్జెక్ట్స్ కు హార్ట్ ఫుల మ్యూజిక్ అందించే గోపీ సుందర్ ఈ గీత గోవిందం కు సంగీత దర్శకుడు. మళయాలంలో గోపీ సుందర్ మ్యూజిక్ అందించిన లవ్ స్టోరీస్ అన్నీ బిగ్గెస్ట్ హిట్స్. ఇది కూడా ఆ కోవలోకే వస్తుందనేది ఇప్పటికే వచ్చిన రెండు పాటలూ ప్రూవ్ చేస్తున్నాయి. ఇక యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా కూడా మరో విజయం అందించేదిలా ఉంది. హీరోయిన్ రష్మిక అరంగేట్రంతో అదిరిపోయే హిట్ అందుకుంది. ఈ సెకండ్ మూవీతో మరో హిట్ బ్యాగ్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ నెల 29ప జేఆర్సీ కన్వెన్షన్ లో జరగబోయే ఈ ఆడియో ఫంక్షన్ అల్లు అర్జున్ ఎంట్రీ అదనపు బలాన్ని తెస్తుందనే చెప్పాలి.

More Related Stories