English   

 విజ‌య్ మ‌ళ్లీ గెట‌ప్ మార్చాడు తెలుసా.. ?

Vijay-Deverakonda
2018-09-25 10:14:14

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ఏం చేసినా సంచ‌ల‌న‌మే. గీత‌గోవిందం త‌ర్వాత మ‌నోడి ఇమేజ్ అలా పెరిగిపోయింది మ‌రి. ఈ చిత్రం ఒక‌టా రెండా 125 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఆరు వారాలు ముగిసిన త‌ర్వాత కూడా కొన్ని చోట్ల నామ‌మాత్ర‌పు వ‌సూళ్లు తీసుకొచ్చింది ఈ చిత్రం. గీత‌గోవిందం ముందు నుంచి కూడా క్లీన్ షేవ్ తోనే ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఏడాదిన్న‌ర కింద అర్జున్ రెడ్డి కోసం గ‌డ్డం పెంచుకుని క‌నిపించిన ఈ కుర్రాడు.. ఇప్పుడు మ‌ళ్లీ పాత గెట‌ప్ లోకి వెళ్లిపోయాడు. ఎందుకో తెలియ‌దు కానీ మ‌ళ్లీ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు విజ‌య్.  ట్యాక్సీవాలాలో కూడా క్లీన్ షేవ్ తోనే క‌నిపించాడు విజ‌య్. ఇక నోటాలో కూడా అంతే. కానీ ఇప్పుడు మిర్చి అవార్డ్స్ కు వ‌చ్చిన విజ‌య్ మాత్రం గ‌డ్డంతో అర్జున్ రెడ్డి గెట‌ప్ లోకి మారాడు. ఇది చూసి నెక్ట్స్ సినిమా కోసం ఇలా మారిపోయాడా అనే అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. అయితే ఈ గ‌డ్డం ఊరికే పెరిగిందా.. లేదంటే కావాల‌నే పెంచాడా అనేది మాత్రం విజ‌య్ చెప్పేవ‌ర‌కు క్లారిటీ ఉండ‌దు. ఏదేమైనా ఒక్క‌టి మాత్రం నిజం.. గ‌డ్డంలోనూ ర‌ప్ఫాడించాడు ఈ హీరో. ప్ర‌స్తుతం నోటా విడుద‌ల కోసం చూస్తున్నాడు విజ‌య్. ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

More Related Stories